గురుకులాల్లో పౌష్టిక ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
సూర్యాపేట గురుకుల పాఠశాలను నేను దత్తత తీసుకుంటాను
విద్యార్థుల ఎడ్యుకేషన్ టూర్స్ కు టూరిజం కార్పొరేషన్ తరపున సహకారం అందిస్తా
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 14 ::డైట్ చార్జీల పెంపుతో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని ప్రారంభించిన రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నిరుపేద విద్యార్థులు చదువుకునే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు ప్రభుత్వం డైట్ చార్జీలను పెంచిందని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాలలో వారు డైట్ చార్జీల పెంపు నూతన మెనూ అమలు ప్రారంభ కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని గురుకుల పాఠశాలలో సంక్షేమ హాస్టల్లో డైట్ చార్జీలను పెంచిందని, 8 సంవత్సరాల తర్వాత 40% డైట్ చార్జీలను అదేవిధంగా పదహారేళ్ల తర్వాత కాస్మోటిక్ చార్జీలను 200% ప్రభుత్వం పెంచిందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టల్లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ హాస్టల్ అన్ని ప్రత్యేక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు డైట్ మరియు కాస్మోటీక్స్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించిందని అన్నారు. పేద విద్యార్థులకు మంచి చదువు అందించాలని, ప్రతి మండలానికి ఇంటిగ్రేట్ స్కూలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని 1వ తరగతి నుండి ఇంటర్ వరకు చదువుకునే విధంగా శ్రీకారం చుట్టారని తెలిపారు. బాలుర గురుకుల పాఠశాలలో బెంచీలు, బాత్రూములు కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని అలాగే అదనపు తరగతి గదులు లేక ఇబ్బంది అవుతుందని దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేస్తానని అన్నారు. ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సూర్యాపేట లో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలో పలు సమస్యలను సిబ్బంది తన దృష్టికి తీసుకువచ్చారని ఈ విద్యాలయాన్ని తాను దత్తత తీసుకొని ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ రామ్మూర్తి, ప్రిన్సిపాల్ విద్యాసాగర్, కౌన్సిలర్ గంగాభవాని తదితరులు పాల్గొన్నారు.