అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

Uncategorized తాండూర్ తెలంగాణ రాజాకియం వికారాబాద్

 అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

 

ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల డిమాండ్

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 19 ::: భారత పార్లమెంట్లో భారత రాజ్యాంగ రూప శిల్పి అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని అవమానపరిచేలా మాట్లాడిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్భంగా CITU జిల్లా ఉపాధ్యక్షులు కే శ్రీనివాస్ ,KNPS రాష్ట్ర నాయకులు A. చంద్రప్ప,PDSU ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ లు మాట్లాడుతూ రాజ్యసభలో అంబేద్కర్ గారి పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారు చేసిన ఉద్దేశ పూర్వక వ్యాఖ్యలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు బిజెపి తన పుట్టుక నుంచి భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని వ్యతిరేకిస్తూ వస్తున్నదని అన్నారు అందులో భాగంగానే రాజ్యాంగాన్ని రద్దు చేసి మను ధర్మాన్ని అమలు చేయాలని చూస్తున్నారని తెలిపారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి పై భారత రాజ్యాంగంపై నిరంతరం వ్యతిరేకతను ప్రదర్శించడమే కాకుండా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి తూట్లు పొడుస్తు మళ్లీ తామే రాజ్యాంగ పరిరక్షకుల లాగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు అణగారిన జాతులను కనీసం మనుషులు కాక కూడా గుర్తించకుండా బానిసలుగా వ్యవహరించిన సందర్భంలో వారికి హక్కులను కల్పించి చట్టబద్ధ రాజ్యాంగబద్ధ హోదాలలో నిలిపిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి అంటేప్రజలకు నిజంగానే ఫ్యాషన్ అని అన్నారు లౌకిక రాజ్యం కోసం పోరాడిన అంబేద్కర్ విలువ మతోన్మాదులకు ఏం తెలుసు అని ప్రశ్నించారు కుల ఉన్మాదాన్ని కఠినంగా అమలు చేస్తూ బ్రహ్మణ ఆధిపత్య ధోరణి తో కుల వివక్ష ,అణచివేత విధానాలకు మద్దతు పలుకుతూ సామాజిక న్యాయాన్ని ప్రజలకు దూరం చేస్తున్నదని విమర్శించారు,విద్వేష రాజకీయాలను వ్యతిరేకించి లౌకిక రాజకీయాల కోసం జీవితాంతం కృషి చేసిన అంబేద్కర్ పై బిజెపి వైఖరిని ప్రజలు ముక్త కంఠం తో వ్యతిరేకించాలని పిలుపు ఇచ్చారు తక్షణమే హోంమంత్రి అంబేద్కర్ గారి పై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని పదవికి రాజీనామా చేయాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.

 అంబేద్కర్ పట్ల అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని.ప్రజా సంఘాల నాయకులు , విద్యార్థి సంఘాలు, మేధావులు అందరూ పాల్గొనాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో PDSU జిల్లా సభ్యులు ప్రకాష్, వెంకట్ ,నవీన్, కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, ప్రజా సంఘాల నాయకులు అశోక్, రాజు, వీరేశం తదితరులు పాల్గొన్నారు.