రెండవ రోజు గ్రూప్ -II పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్
సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం. తేది :16-12-2024
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 16 :::: రెండవ రోజు జరుగుతున్న గ్రూప్-II పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అన్నారు. రెండవ రోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో లోని శ్రీ వేంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల, పలు పరీక్ష కేంద్రాలను ఎస్పి పరిశీలించారు. బందోబస్తు నిర్వహణలో సిబ్బంది అందరూ బాగా పని చేశారు అన్నారు. అన్ని స్థాయిల్లో పోలీస్ అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పరీక్ష కేంద్రాలను సందర్శించి పటిష్టమైన బందోబస్త్ పర్యవేక్షణ చేయడం జరిగిందని అన్నారు. .ఎస్పి గారి వెంట సూర్యాపేట సబ్ డివిజన్ DSP రవి, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు, సూర్యాపేట రూరల్ CI రాజశేఖర్, బందోబస్తు SI లు, సిబ్బంది ఉన్నారు.