తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 14 ::: సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామానికి చెందిన గుణగంటి వీరస్వామి తండ్రి నరసయ్య వయసు (57) సంవత్సరాలు అనే గీత కార్మికుడు శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు గుది జారి కింద పడటంవల్ల ఎడమ తోటి కంటే బొక్క విరిగినది నడుము గట్టిగా గుద్దుకోవటం వల్ల శ్వాస ఆడటం లేదు కాలుకు చేతులకు బలమైన గాయాలు తగిలినవి. వెంటనే ఆటో ద్వారా సూర్యాపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతునాడు. తక్షణమే ప్రభుత్వం నుండి ఆతనికి 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని *కల్లు గీత కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు* డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బోడపట్ల జయమ్మ కల్లు గీత కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి నాగ మల్లయ్య మామిడి సతీష్ బోడపట్ల వీరభద్రం బోడపట్ల చిన్ని బోడపట్ల భద్రయ్య గుణగంటి కృపాకర్ కారింగుల బిక్షమమ్మ తదితరులు పాల్గొన్నారు.