దివ్యాంగులు సంకల్పంతో ముందుకు సాగాలి: ఎంపీడీవో సుధాకర్ రెడ్డి
ఎంఈఓ మురళీకృష్ణ
చిన్న చింతకుంట డిసెంబర్ 4 (మీ న్యూస్);పాఠశాలలో క్రీడా పోటీలు నిర్వహించారు.శరీరానికి ఉన్న వైకల్యాన్ని అధిగమిస్తూ మంచి సంకల్పంతో దివ్యాంగులు ముందుకు సాగే ఉత్తమ ఫలితాలు సాధించాలి అని ఎంపీడీవో సుధాకర్ రెడ్డి మండల విద్యాధికారి మురళీకృష్ణ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినస్వాన్ని పురస్కరించుకొని చిన్న చింతకుంట మండల, వనరుల కేంద్రంలో సి డబ్ల్యూ ఎస్ ఎన్ విద్యార్థిని విద్యార్థులకు ఆట పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులు మనోధైర్యంతో అన్ని రంగాలలో రాణించాలని ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని అన్నారు. క్రీడల పోటీలో విజయం సాధించిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను మా దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ ఈ డి ప్రసన్న కుమారి, ఎం ఐ ఎస్ కవిత, సి ఆర్ పి లు ప్రవీణ్ ,విజయ్ సింహాలతో పాటు తదితరులు పాల్గొన్నారు.