ఆర్థిక చేయూత అందించిన ఉపాధ్యాయ సంఘాలు, విద్యావంతుల వేదిక నాయకులు
మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 4 ::
కీర్తిశేషులు ఈనాడు వెంకటయ్య (బొమ్మరాస్ పేట) గారి కుమార్తె ముందస్తు వివాహా కార్యక్రమానికి హాజరై ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ఉపాధ్యాయ సంఘాలు విద్యావంతుల వేదిక నాయకులు ఈరోజు బొమ్మరాస్పేట పేట పట్టణంలోని వారి నివాసానికి వెళ్లి వారి సతీమణి పిల్లలతో సమావేశమై వివాహ కార్యక్రమాల గురించి చర్చించి పెళ్లి ఖర్చుల నిమిత్తం వారికి భరోసానిస్తూ ,ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా వారి గురించి చర్చిస్తూ వారు జర్నలిజం వృత్తికి,సమాజ చైతన్యానికి విద్యాభివృద్ధికి పత్రికాముఖంగా చేసిన సేవలు కొనియాడారు వారు అందరితో స్నేహభావనాన్ని ప్రదర్శించే వారిని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డి అండ్ హెచ్ ఓ రవీంద్ర యాదవ్ గౌరవ మండల విద్యాధికారి రామిరెడ్డి టీవీవీ వినాయకులు రవీందర్ గౌడ్ యూటీఎఫ్ నాయకులకు గౌరారం గోపాల్ తపాస్ నాయకులు భాకారం చంద్రశేఖర్,మల్లయ్య,పి ఆర్ టి యు నాయకులు అనిల్ కుమార్,మహిళా నాయకురాలు శ్రీ ప్రియ పాత్రికేయ సోదరులు సాక్షి అంజలయ్య ఈనాడు విలేఖరి నర్సింలు ఆంధ్రజ్యోతి విలేకరి అంజలయ్య , జనస్వరం విలేఖరి నరసింహులు గౌడ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి మీసేవ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు