హుజూర్నగర్ నియోజకవర్గం లో మఠంపల్లి ఎస్సై గా విదులు నిర్వహిస్తున్న రామాంజనేయులు
మీ న్యూస్ డిసెంబర్ 4::: పలు అవినీతి ఆరోప ణల నేపథ్యంతో జిల్లాలోని మఠంపల్లి ఎస్సై రామాంజనేయులును విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలంగాణ మల్టీ జోన్-2 ఐజీ సత్య నారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మట్టపల్లికి చెందిన ఓ వ్యక్తి అమెరికాలో స్థిరప డ్డారు. ఇటీవల ఎస్సై రామాంజనేయులు ఆ వ్యక్తికి చెందిన కారు మట్టపల్లిలోనే ఉండటంతో తన సొంత అవసరాల కోసం వినియోగించుకొని తిరిగి ఇస్తానని తీసుకున్నారు. కానీ వారం రోజులు గడుస్తున్నా కారును తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తుండటంతో బాధితుడు ఈ విషయమై డీజీపీతో పాటు జిల్లా ఎస్పీకి ఈ- మెయిల్ ద్వారా పిర్యాదు చేశారు…ఎస్సైపై విచారణకు ఆదేశించిన అధికారులకు ఈ ఘటనతోపాటు పలు అవినీతి ఆరోపణలు వెలుగు చూసినట్లు సమాచారం..దీంతో ఎస్సై రామాంజనేయు లును విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు…