Uncategorized తాండూర్ రాజాకియం వికారాబాద్

వాల్ పోస్టర్ ఆవిష్కరించిన బిసి జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్

బీసీల రాజ్యాధికారం కొరకు ఉద్యమిద్దాం

ఈనెల 25న జరిగే బీసీల సమరభేరిని విజయవంతం చేద్దాం

జాతీయస్థాయిలో కుల గణన చేపట్టాలని 25న బీసీల సమరభేరి

 –జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి 

మీ న్యూస్ ప్రతినిధి :::: భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్న బీసీలకు రాజ్యాధికారంలో పూర్తిస్థాయి వాటా దక్కలేదని జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి అన్నారు దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీల సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. తాండూరు పట్టణంలోని హోటల్ హిమాలయ హోటల్ లో మీడియా సమావేశం నిర్వహించారు, బీసీల సమరభేరికి సంబంధించిన గోడపత్రికను వివిధ కులసంఘాల నాయకులు బీసీ సంఘం నాయకులు బీసీ మహిళా సంఘం నాయకులతో కలిసి రాజ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీలు కనిపించని దోపిడీ వివక్ష అనుచువేతకు గురవుతున్నారన్నారు గత 45 సంవత్సరాలు పైగా ఆర్ కృష్ణయ్య అనేతృత్వంలో బీసీలు అనేక ఉద్యమాలు చేసి ఎన్నో విజయాలు సాధించారని ఇప్పుడు మిగిలింది ఒక్క బీసీల రాజ్యాధికారమే కావున బీసీలంతా పార్టీలకు అతీతంగా ఏకమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని ఈనెల హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే బీసీల సమరభరికి వికారాబాద్ జిల్లా నుండి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొనాలని రాజ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ శుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, సోషల్ మీడియా ఇన్చార్జి బస్వరాజ్, తాండూర్ మండల అధ్యక్షుడు బసంత్ కుమార్, యాలల మండల అధ్యక్షుడు లక్ష్మణ్ చారి, బషీరాబాద్ మండల అధ్యక్షుడు నరేందర్, పెద్దేములు మండల అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, టైలర్ రమేష్, రాము ముదిరాజ్, మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు కొండాపూర్ అనిత, అంతారం అనిత, తస్లీన్ బేగం, తాండ్ర నరేష్, పరమేష్, జంటపల్లి వెంకట్, శివకుమార్ నర్సింలు, రమేష్, ఆరేకటిక సమాజం నాయకులు సురేష్, టీర్ఎస్వి నాయకులు దత్తు, రాజక సంఘం అధ్యక్షుడు గోపాల్, కుమ్మరి సంఘం నాయకుడు శంకర్, లింగయత్ సమాజ నాయకులు కోటం సిద్ద లింగం, గౌడ సంఘం నాయకులు బాబా గౌడ్, క్షత్రియ సమాజం నాయకులు అజిత్ ఠాకూర్, సమాజం నాయకులు బాలాజీ ఠాకూర్, బీసీయువ నాయకులు మంతటి రాజు, రామ్ రెడ్డి,, రాజ శేఖర్, నర్సింలు, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.