బాలికల అభ్యున్నతికి కార్పొరేట్ కంపెనీలు చేయూత అందించాలి
ఎస్.వెంకటేశ్వర్లు.
జిల్లా విద్యాశాఖాధికారి
ప్రిన్స్ పైప్స్ సహకారంతో మహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శౌచాలయం(టాయిలెట్స్) పునర్ నిర్మాణం
బాలికల సంక్షేమం కోసం స్వచ్ఛంద సంస్థల ఆర్థిక సహకారంతో పాఠశాలలో శౌచాలయాలు (టాయిలెట్స్) ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయం అని సంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.వెంకటేశ్వర్లు అన్నారు. ప్రిన్స్ పైప్స్ కంపెనీ మరియు సత్వా కన్సల్టెన్సీ వారి సహకారంతో మహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు సదాశివపేట మండలంలోని నిజాంపూర్,కోనాపూర్ మరియు పెద్దాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ,విద్యార్థుల కోసం శౌచాలయాలు (టాయ్లెట్) లను ప్రారంభించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.వెంకటేశ్వర్లు మరియు ప్రిన్స్ పైప్స్ కంపనీ ప్లాంట్ హెడ్ రాజశేఖర్, మహిత స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్స్ పైప్స్ రాజశేఖర్ గారు మాట్లాడుతూ మహితా స్వచ్ఛంద సంస్థ సదాశివపేట మండలంలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని వాటిని మహిళలు, ఆడపిల్లలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి పేద అమ్మాయిలకు ₹10,000 రూపాయలు స్కాలర్ షిప్స్ మహిత సంస్థ ద్వారా ఇవ్వడం జరిగిందని తద్వారా వారు ఉన్నత విద్య కొనసాగిస్తారని తెలపడం జరిగింది. అదేవిధంగా విద్యాశాఖ అధికారి ఎస్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సదాశివపేట మండలంలోని ఏడు గ్రామాల పాఠశాలల విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్స్ అనగా బ్యాగ్స్,బుక్స్, పెన్నులు, స్కేచ్ పెన్నులు అందించడం మరియు టాయిలెట్స్ నిర్మించడం చాలా సంతోషించ విషయమని తెలిపారు.ఈ సందర్భంగా మహితా సంస్థ మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ మహిళల మరియు విద్యార్థినుల కోసం మేము అనేక కార్యక్రమాలు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో ఇంకా చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు మహిళలు మరియు విద్యార్థినుల గురించి చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎన్.శంకర్ , కాంప్లెక్స్ హెచ్.ఎం రాజశ్రీ ,ప్రాజెక్టు కో ఆర్డినట్వర్ రవి, మొబిలిజర్ స్వప్న, రాజు సిఆర్పి నగేష్ మరియు ఉపాద్యాయులు పాల్గొన్నారు.మీ 31న్యూస్ ప్రతినిధి కే అశోక్