Uncategorized

సీనియర్ కాంగ్రెస్ నేత తీవ్ర మనస్థాపన..!
– కార్యకర్తల సమావేశం నుంచి వెళ్లిపోయిన మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవరెడ్డి
-బీఆర్ఎస్ నుంచి కొత్తగా వచ్చిన నేతలకు ప్రాధన్యత
-కష్టకాలంలో పార్టీ జెండా మోసిన నేతలు అసంతృప్తి..
-గత 5 ఏండ్లు కాంగ్రెస్ బలోపేతానికి ఎంతో కృషి చేసిన నేత..

దీక్షతెలుగు న్యూస్,తాండూరు :

కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసే సీనియర్ నేత తీవ్ర మనస్థాపనకు గురయ్యారు.
పార్టీ కోసం కష్టపడి పని చేసిన నాయకులకు కాకుండా ఇవ్వాళ పార్టీలోకి వచ్చిన నేతలకు ఎలా ప్రాధాన్యత ఇస్తున్నారని పలువురు నేతలు మండి పడుతున్నారు. ఆదివారం తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్లో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఇట్టి సమావేశానికి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు హాజరయ్యారు. వేదిక పైకి సరైన గుర్తింపు లేని, పార్టీ కోసం కష్టపడని నాయకులను ఆహ్వానించారు.దీంతో బషీరాబాద్ మండలం మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవరెడ్డిని వేదిక పైకి ఆహ్వానించకపోవడంతో అవమానానికి గురై, సమావేశం మధ్యలో నుంచి వెళ్లిపోయారు. ఇది గమనించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాధవ రెడ్డి వేదిక పైకి రావాలని కోరారు. అంతలోనే మాధవరెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయారు.కొన్ని సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసిన నేతలకు గుర్తింపు లేకుండా పోయిందని ఆ పార్టీ సీనియర్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నేతగా మాధవరెడ్డి అనేకసార్లు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రశ్నిస్తే.. అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లకు పంపించిన సందర్భాలను అక్కడ ఉన్న నాయకులు గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి గుర్తించి,ప్రాముఖ్యత ఇవ్వడం ఏంటని అక్కడ ఉన్న కొందరు నాయకులు గుసగుసలు వినిపించాయి.దీంతో కష్టకాలంలో పార్టీ జెండా మోసిన నేతకు అవమానం జరగడం చర్చనీయాంశంగా మారింది.