నిధుల కోసం కాంగ్రెస్ లీడర్స్ కొట్లాట

Uncategorized

నిధుల కోసం కాంగ్రెస్ లీడర్స్ కొట్లాట

-మంజూరైన నిధుల కేటాయింపులో కార్యకర్తల కుమ్ములాట -తలపట్టుకుంటున్న బడా నేతలు
-ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొంది..!
-పోలీసులను ఆశ్రయించిన ఇరువురు

-పెద్దేముల్ మండలంలో చోటు చేసుకుంది..

దీక్షతెలుగు న్యూస్, తాండూరు :

గ్రామాల అభివృద్ధి కోసం మంజూరైన నిధుల కేటాయింపు విషయంలో కార్యకర్తల మధ్య మాటకు మాట పెరగడంతో కొట్లాటకు దారి తీసిన సంఘటన పెద్దేముల్ మండలంలోని తట్టేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వివిధ అభివృద్ధి పనులకోసం మంజూరైన నిధులను గ్రామంలో వివిధ పనులు చెప్పట్టలని గ్రామ పెద్దలు,పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసి ఒకదగ్గర సమావేశం కావడంతో అభివృద్ధి కోసం మంజూరైన నిధులను తమకంటే తమకు కేటాయించాలని అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇరువురు మధ్య కొట్లాటక దారి తీసింది. వెంటనే గ్రామ పెద్దలు అడ్డుకున్న వినకుండా ఒకరినొకరు కొట్టుకొని పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదులు చెనుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సేల్ అధ్యక్షుడు సాబీర్ కు రక్తపు గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లిపోయారు.ఏదేమైన గ్రామ సర్పంచుల పదవి కాలం ముగిసిన తరువాత గ్రామ పంచాయతిలలో అభివృద్ధి కార్యక్రమాల నిధుల విషయాల్లో నాయకుల మధ్య వైర్యాలు పెరుగుతున్నాయడానికి నిదర్శనంగా ఉందని పలువురు వాపోతున్నారు.

హస్తం పార్టీలో విభేదాలు..!

కాంగ్రెస్ పార్టీలో విభేదాలకు తెరవేసిందని పలు పార్టీ నాయకులు వాపోతున్నారు. పలు సందర్భాల్లో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఐక్యమత్యంగా ఉండాలని చెప్పిన దాఖలు ఉన్నాయి. అలాగే అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తీసుకొస్తే పరిష్కారం చేస్తానని భరోసా కూడా ఇచ్చారు. కానీ నిధుల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు కొట్లాడ్డంతో పార్టీకే నష్టం వచ్చే అవకాశం ఉందని, వెంటనే ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవ తీసుకొని ఇరువురికి నచ్చచెప్పి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఐక్యమత్తంగా ఉండేలా చూడాలని కాంగ్రెస్ పార్టీశ్రేణులు కోరుతున్నారు. రానున్న రోజుల్లో ఐక్యమత్తంగా ఉంటారా..? మరింత విభేదాలకు తెరవేస్తారా..? అని తెలియాలంటే వేచి చూడాలా మరి.