రైతుల ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి.

Uncategorized చివ్వేంల రాజాకియం వ్యవసాయం సూర్యాపేట

రైతుల ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి.

 గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య

 మీ న్యూస్ ప్రతినిధి : చివ్వేంల మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు సెంటర్ ను పరిశీలించి మాట్లాడారు తెలంగాణ లో ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ మొదలై వరి కోతలు మొదలై 25 రోజులు అయినవి రైతులు వరి ధాన్యం కొనుగోలు సెంటర్లో పోసి ఉన్నారు ఈ అకాల వర్షాల తుఫాన్ వలన అనేక ఇబ్బందులు పడుతుంటే గత 15 రోజుల క్రితం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది నేటికి రాష్ట్రంలో ఒక్క బస్తా వడ్ల కాటా కూడా వేసిన దాకాలు లేవు వరి ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు 500 బోనస్ ఇస్తామని మాయమాటలు చెప్పి కాలం గడుపుతున్నారు అసలు బోనస్ కాదు బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేయడం తప్ప మరేమీ లేదు అన్నారు.కావున రాష్ట్ర ప్రభుత్వం రైతు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి రైతులకు వెంటనే డబ్బులు వారి ఖాతాలో వేయాలని గ్రామీణ పేదల సంఘం డిమాండ్ చేస్తుంది రైస్ మిల్లర్లు తేమ పేరుతో కోతలు విధించడం కొనుగోలు కేంద్రాల వద్ద మాచర్ పేరుతో కొనుగోలు ఆపకూడదు డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి కొనకంచి వీరభద్రయ్య ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ జిల్లా కార్యదర్శి భాషీపంగు సునీల్గ్రామీణ పేదల సంఘం జిల్లా నాయకులు అనంతుల ఎల్లయ్య ఉప్పుల మల్లయ్య బచ్చలకూరి శ్రీకాంత్ రైతులు దారావత్ లక్ష్మి. ధరావత్ లక్ష్మ .ధరవత్ రాము.ధరావత్ బీమా. పూలమ్మ .సాగర్ శ్రీకాంత్. కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు