సిసి రోడ్డు పనులను ప్రారంభించిన బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ
మీ న్యూస్ ప్రతినిధి అక్టోబర్ 23 :: జహీరాబాద్ మండలంలోని ఆనేగుంట గ్రామంలో గతంలో PMGSY కింద నాలుగు కోట్ల ముప్పై ఒక లక్షల రూపాయల రోడ్డు ను 30.01.2022 నాడు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు జహీరాబాద్ శాసన సభ్యులు కొనింటి మానిక్ రావు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసినారు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో బీటీ రోడ్డు వర్క్ చేసి గ్రామ ప్రధాన వీధి సిసి రోడ్లను చేయలేదు నెల కిందట ఎమ్మెల్ల్యే గ్రామంలోని ప్రధాన రోడ్డు పెండింగ్లో ఉన్న పని ఇన్ని రోజులుగా ఎందుకు చేయలేదని జిల్లా కలెక్టర్ ఆఫీసులో దిశా మీటింగ్లో ఎమ్మెల్యే మానిక్ రావు గారు ప్రశ్నించి ఇట్టి పనిని ఇన్ని రోజులుగా చేయడం లేదని అధికారులను ప్రశ్నించడంతో వెంటనే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని కోరడంతో అధికారులు ఈ రోజు పనులు ప్రారంభించినందుకు అనేగుంట గ్రామస్తుల తరపున స్థానిక ఎమ్మెల్యే శ్రీ కొనింటి మాణిక్ రావు గారికి తట్టు నారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలోపంచాయత్ రాజ్ AE నవీన్ కుమార్ మాజీ సర్పంచులు హన్మన్న జగదీష్, గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గొల్ల జగన్నాథం, నాగంకెరీ కిష్టయ్య ,కోమారి కిష్టయ్య,గొల్ల నర్సిములు, వడ్ల రఘుపతి,స్వామిదాస్, లక్మయ్య, చెంద్రయ్య,రాములు తదితరులు పాల్గొన్నారు