బదిలీపై వెళ్తున్న ఎంపీడీవో కు ఘన సన్మానం

Uncategorized

బదిలీపై వెళ్తున్న ఎంపీడీవోకు ఘన సన్మానం..
– ఎంపీడీవో సేవలు అభినందనీయం
– సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఎంపీడీవో సుదర్శన్ రెడ్డి

దీక్షతెలుగున్యూస్, తాండూరు :


తాండూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి గా వీధుల నిర్వహించి లోక్ సభ ఎన్నికల బదిలీల్లో భాగంగా
నల్గొండ జిల్లా దేవరకొండ కి వెళ్తున్న ఎంపీడీవో సుదర్శన్ రెడ్డికి, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో విశ్వప్రసాద్ కి శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అనిత రవి గౌడ్, రెవెన్యూ అధికారులు,తాజా మాజీ సర్పంచ్లు, కార్యాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. కొని ఏండ్ల నుండి ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు తోటి సిబ్బంది గ్రామాల, మండల అభివృద్ధికి తనకు సహాయ సహకారాలు అందజేశారని, అది ఎన్నటికీ మరిచిపోలేనని ఆయన అన్నారు. ఎక్కడ వీధులు నిర్వహించిన మండలానికి మాత్రం మర్చిపోలేనని వివరించారు. పలువురు అధికారులు మాట్లాడుతూ..ఎంపీడీవోగా సుదర్శన్ రెడ్డి వీధిలో చేరిన నాటి నుండి నేటి వరకు అందరితో కలిసి మెలిసి ఉంటూ మండలాన్ని అభివృద్ధికి చేయించారని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత మళ్లీ తిరిగి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా వస్తారనే అశాభావం వ్యక్తం చేశారు. ఆయన సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనిత, ఎల్మకన్నా సొసైటీ చైర్మన్ రవి గౌడ్, వైస్ ఎంపీపీ స్వరూప వెంకట్రాంరెడ్డి, డిప్యూటీ తహసిల్దార్ విజేందర్, ఎంపీఓ రతన్ సింగ్ , పంచాయతీరాజ్ ఏఈ నందిని రెడ్డి, ఆర్ఐలు రాజీరెడ్డి బాలరాజ్, మాజీ సర్పంచులు రాజప్ప గౌడ్ నాగప్ప, పద్మమ్మ, నాయకులు వెంకటరామిరెడ్డి, రామలింగారెడ్డి తదితరులు ఉన్నారు.