కష్టజీవులకు అండగా నిలిచేది సిపిఐ (ఎం) పార్టీ మాత్రమే
సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు
మీ:: న్యూస్ సూర్యాపేట డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::మోతే : నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ కష్ట జీవుల హక్కుల కోసం ఉద్యమించేది సిపిఐ(ఎం) పార్టీ మాత్రమే అని సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. శనివారం మండల పరిధిలోని బురకచర్ల గ్రామంలో నిర్వహించిన సిపిఐ (ఎం )పార్టీ గ్రామ శాఖ మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉన్నవ్యవసాయ కార్మికుల,రైతుల హక్కుల కోసం నిరంతరం ఉద్యమాలు చేసేది సిపిఐ( ఎం )పార్టీ మాత్రమేనని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీ స్కీములను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా నేటికీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం లక్ష వరకు మాత్రమే రుణమాఫీ చేసి చేతులు తెలుపుతుందని ఎద్దేవా చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఆదుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా సిపిఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శిగా కొండ భాస్కర్, మహిళా శాఖ కార్యదర్శిగా రెడ్డి మల్ల ఇందిర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలోసిపిఐ (ఎం) మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి, మండల కమిటీ సభ్యులుకక్కిరేణి సత్యనారాయణ,కొండ రాములు,చర్లపల్లి మల్లయ్య,బానోతు లచ్చిరాం, గుగులోతు కృష్ణ, గ్రామ కార్యదర్శికొండ భాస్కర్ పాల్గొన్నారు.