ఎస్ఎఫ్ఐ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం

Uncategorized నల్లగొండ మోతే రాజాకియం సూర్యాపేట

ఎస్ఎఫ్ఐ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం

మీ:: న్యూస్ ప్రతినిధి సూర్యపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్::మోతె:విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలని హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద శాంతియుతంగా విద్యార్థి మహా గర్జన సభను నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను మరియు విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని sfi జిల్లా ఉపాధ్యక్షులు అక్కినపల్లి వినయ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలి..తెలంగాణ రాష్ట్రంలో గత ఆరున్నర సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల కోట్లు పైగా స్కాలర్షిప్ ఫీజు రీయంబర్స్మెంట్ విడుదల చేయాలని కేజీ టు పీజీ వరకు విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమించాలని పెండింగ్లో ఉన్న మెస్ కాస్మోటిక్ చార్జీలను విడుదల చేసి గురుకులాలకు మరియు సంక్షేమ వసతి గృహాలకు పక్కా భవనాలను నిర్మించాలని తదితర డిమాండ్లతో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు మరియు విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేయటం సరైంది కాదన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులపై నిర్బంధాలను ప్రయోగిస్తుందన్నారు. మా ప్రభుత్వం వస్తే విద్యార్థులకు సమస్యలు ఉండవని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 9 నెలలు కావస్తున్న విద్యార్థుల సమస్యలను ఎందుకు పరిష్కారం చేయట్లేదు అన్నారు. సమస్యలను పరిష్కారం చేయకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుంది అన్నారు. రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి గ్రామంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతారని హెచ్చరించారు. అరెస్టు చేసిన నాయకులను తక్షణ విడుదల చేయాలని అక్రమ కేసులను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులతో ప్రతి జిల్లాలో ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు మధు రవి వేణు తదితరులు పాల్గొన్నారు.