ప్రతి మండలానికో ఎంఈఓ ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం..డిటిఎఫ్
నూతనకల్..మీ న్యూస్ ప్రతినిధి ..ఎన్నో ఏండ్లుగా మండలానికో మండల విద్యాధికారి లేక పర్యవేక్షణ కుంటుపడిందని, కొత్తగా వచ్చిన ప్రభుత్వం మండలానికి ఒక ఎంఈఓ ను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రేపాక లింగయ్య తెలిపారు.మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన జిల్లాలకు డి ఈ ఓ లను, మండలాలకు ఎంఈఓ పోస్టులను మంజూరు చేయడం శుభపరిణామమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు అబ్రహం, దేవేందర్,రవి కుమార్,యాదగిరి,రాములు, వెంకటేశ్వర్లు,కొరివి మధు,ఎస్ కె సైదులు తదితరులు పాల్గొన్నారు