ప్రజా శాంతికి భంగం కలిగించిన వారిపై కేసు నమోదు

Uncategorized క్రైమ్ నల్లగొండ మోతే సూర్యాపేట

ప్రజా శాంతికి భంగం కలిగించిన వారిపై కేసు నమోదు

 –శాంతి సమావేశం ద్వారా డి జె కు అనుమతి లేదు

 —వినాయక శోభయాత్రలో అనుమతి లేని, డీజే వినియోగిస్తున్న మండపాల సభ్యులు 

 —-గ్రామ ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా శోభయాత్ర కొనసాగించాలి 

 

— మోతే యస్. ఐ. బి. యాదవేంద్ర రెడ్డి,

                                        

మీ:: న్యూస్ ప్రతినిధి::మోతే మండల పరిధిలోని వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసిన కమిటి సభ్యులకు, వినాయక చవితి కమిటీలకు పలు సూచనలు, సలహాలు ఏమనగా, డి. జే.లకు అనుమతి లేదు, అయినను, పోలీసు వారి సూచనలను పాటించకుండా నిన్నటి రోజు విభులపురం గ్రామములో వినాయక విగ్రహా నిమజ్జనం చేసే నిమ్మజన కార్యక్రమములో మైనంపాటి సాయి తండ్రి వెంకట రెడ్డి, మైనంపాటి మహేందర్ రెడ్డి తండ్రి ప్రబాకర్ రెడ్డి, ముల్కూరి అశోక్ రెడ్డి, ముల్కూరి బాలరాజు మరియు వినాయక విగ్రహామునకు సంభందించిన కమిటి సభ్యులు కొందరు, ప్రభుత్వ ఉత్తరువులను దిక్కరించి, ఎలాంటి అనుమతి లేకుండా, అక్రమముగా ప్రభుత్వం నిషేదించిన రాంపురం తండాకు చెందిన ధరావత్ మహేష్ గారి టాటా ఏ.సి. ఆటోలో DJ ను పెట్టి, ప్రజల రాకపోకలకు, పెద్ద ఎత్తున DJ శబ్ధాలతో గ్రామములో ఉన్న ప్రజలకు ఇబ్భంది కలిగించు చుండగా పై వారిపై కేసు నమోదు చెయ్యడం జరిగింది. వినాయక విగ్రహామునకు సంభందించిన కమిటి సభ్యులకు శాంంతి సమావేశం ద్వారా పలు సూచనలు తెలపడంం జరిగినది. అయినను పోలీసు వారి ఉత్తర్వులను పాటించకుండా, నిభందనలను అతిక్రమించినచో చట్ట పరమైన చర్యలు తీసుకోబడును. దీని వలన మీరు ఇబ్భందులకు గురి అవుతారు. కావున ప్రజా శాంతికి భంగం కలగకుండా పోలీసు వారికి అన్ని రకాలుగా సహాకరించుచు, నిమజ్జన కార్యక్రమము ప్రశాంతముగా జరుపుకోవాలని కోరుచున్నాను.