విద్యార్థులు టాలెంట్ టెస్టులను సద్వినియోగం చేసుకోవాలి

Uncategorized తెలంగాణ నల్లగొండ సూర్యాపేట

విద్యార్థులు టాలెంట్ టెస్టులను సద్వినియోగం చేసుకోవాలి

సదిశ ఫౌండేషన్ సేవలు అభినందనీయం

విద్యార్థులు టాలెంట్ టెస్టులను సద్వినియోగం చేసుకొని చదువులో ఉన్నత శిఖరాలు సాధించాలని సదిశ ఫౌండేషన్ డైరెక్టర్, తెలంగాణ గణిత ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి దామల్ల కోటేశ్వరరావు ,సూర్యాపేట జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్ కందిబండ శ్రవణ్ కుమార్ తెలిపారు. ఆదివారం మీ న్యూస్ ప్రతినిధి నవంబర్ 10:: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సదిశ గణిత ప్రతిభ పోటీ పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా పాల్గొన్నవారు మాట్లాడుతూ సదిశ ఫౌండేషన్ ద్వారా విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ ను వెలికితీయుటకు ఈ టాలెంట్ టెస్ట్ లు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు. ఈ టాలెంట్ టెస్టులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సదిశ ఫౌండేషన్ సొంత ఖర్చులతో విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఐఐటి కోర్సులకు శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. గత మూడు సంవత్సరాలుగా సదిశ గణిత ప్రతిభ పోటీ పరీక్షలు నిర్వహించి ఎంతో మంది విద్యార్థులకు పోటీ పరీక్షలకు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. ఈ ప్రతిభ పోటీ పరీక్షలో సుమారుగా 800 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా వీరిలో 675 మంది హాజరైనారు .ఇట్టి కార్యక్రమంలో జిల్లా సెక్టోరియల్ అధికారి దేవరశెట్టి జనార్ధన్ డిసిబి సెక్రెటరీ తుంగతుర్తి కళారాణి, సూర్యాపేట మండల విద్యాధికారి శ్రీనివాస గౌడ్ ,శ్లోక అకాడమీ చైర్మన్ మారం వెంకట్ రెడ్డి , తెలంగాణ గణిత ఫోరం జిల్లా అధ్యక్షులు ఎం ,అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండా వెంకటేశ్వర్లు, ట్రెజరర్ మంచాల శ్యామ్ గణిత ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు గణిత అభిమానులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.