మీ న్యూస్ ప్రతినిధి::మోతే మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్ వారు ఐసిఐసిఐ బ్యాంక్ వారి ఒప్పందంతో రైతులను ఉద్దేశించి తీసుకువచ్చిన వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మన గ్రోమోర్ మేనేజర్ రాగిరి రవి గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ భీమ చేసిన కుటుంబానికి దీమగా ఉంటుందని భీమ చేయండి ధీమగా ఉండండి బీమా లేని జీవితం గమ్యం లేని ప్రయాణం వంటిది భీమా కుటుంబానికి భద్రత కల్పిస్తుందని తెలియజేశారు ఈ బీమా కేవలం రైతే కాకుండా 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు లోపు ప్రతి ఒక్కరు సంవత్సరానికి 100 రూపాయలు కట్టి ఈ భీమాన్ని చేసుకోగలరని చెప్పారు ఈ భీమ తీసుకున్నవారు పాము కాటుకు రోడ్డు ప్రమాదం కరెంటు చాకు పిడుగుపాటు వంటి ప్రమాదానికి గురై మరణించినట్లయితే భీమా మొత్తం 2 లక్షల రూపాయలు నామిని కి ఇవ్వడం జరుగుతుంది ఇది కేవలం మన గ్రోమోర్ సెంటర్లో లభిస్తుంది