తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే
త్యాగాలు చేసింది, భూములు పంచింది కమ్యూనిస్టులు
చరిత్రను వక్రీకరిస్తున్న బిజెపి, ఆర్ఎస్ఎస్
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు
మీ::న్యూస్ ప్రతినిధి
మోతే:తెలంగాణసాయుధపోరాటానికి నిజమైనవారసులు కమ్యూనిస్టులేనని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రాఘవాపురం ఎక్స్ రోడ్డులో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుడు బత్తిని పెంటయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూతెలంగాణ రైతాంగసాయుధపోరాటo లో ప్రాణాలను కమ్యూనిస్టులు బలిదానం చేసి తెలంగాణ
ప్రాంతంలో జాగిర్దారులు భూస్వాముల వద్ద ఉన్న
లక్షల భూములు గుంజి పేదలకు పంచడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రాంతంలో 4,000 మంది ప్రాణాలను బలిదానం చేశారని 10 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి పెట్టారని అన్నారు. 3500 గ్రామాలను వ్యక్తి నుండి విముక్తి కల్పించారని గుర్తు చేశారు.
సాయుధపోరాటం వెట్టిసాకిరికి దోపిడీకివ్యతిరేకంగా జరిగిన పోరాటం పోరాటంలో తెలంగాణ అన్ని వర్గాలప్రజలు దోపిడికి పీడనకు పీడనకు గురైనారని అన్నారు . తెలంగాణ సాయుధ పోరాటానికి ఎలాంటి సంబంధం లేని బిజెపి పార్టీ సాయుధపోరాటాన్నివక్రీకరించే దుర్మార్గమైనపద్ధతికివడిగట్టిందన్నారు.సాయుధ పోరాటం హిందూ, ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు.సాయిధ పోరాటం లో అనేకమంది ముస్లింలు కూడా పోరాటంలో నైజాంకు వ్యతిరేకంగా పోరాడి అమరులైనారన్నారు.సాయుధపోరాట ఫలితంగానే దేశంలో భూసంస్కరణల చట్టం వచ్చిందన్నారు. నేడు చరిత్రను వక్రీకరిస్తు బిజెపి తప్పుడు పద్ధతులను ప్రజలు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని సిపిఎం మండల కార్యదర్శి ములుకూరి గోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు గుంట గాని ఏసు, నాగంమల్లయ్య, కిన్నెర పోతయ్య,చర్లపల్లి మల్లయ్య, బానోతు లచ్చిరాం,దోసపాటి శ్రీను, ఎర్రబోయిన మల్సూర్, దోసపాటి చిన్న శ్రీను,గురజాల నాగయ్య,బానోత్ వెంకన్న,బి. వెంకటేశ్వర్లు,బానోతు రమేష్ పాల్గొన్నారు