అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం.  

Uncategorized తెలంగాణ నల్లగొండ సూర్యాపేట

అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం.

 

సూర్య పేట్ జిల్లా ఇంచార్జీ కోల రవీందర్ గౌడ్ ::సూర్య పేట్ జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్ అంగన్వాడి కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను పీపుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చైర్మన్ యాతాకుల సునీల్ అద్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 35వ వార్డ్ కౌన్సిలర్ జ్యోతి శ్రీవిద్య కరుణాకర్ ,సెక్టార్ సూపర్వైజర్ నగిత గారు,ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భూపతి నారాయణ గౌడ్ హాజరై మాట్లాడుతూ పిల్లలను సక్రమైన మార్గంలో నడిపించే వారే నిజమైన ఉపాధ్యాయులని అన్నారు.అనంతరం కౌన్సిలర్ జ్యోతి శ్రీ విద్య కరుణాకర్,అంగన్వాడీ సూపర్ వైజర్ నగిత,టిచర్లు యాతాకుల రుద్రమదేవి, బంగారు పద్మ,లోకేశ్వరీ లను పీపుల్ ఫౌండేషన్ వారు శాలువా తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్ సతీస్,వార్డు పెద్దలు, తల్లులు గడ్డం రేణుక, మాగి ఇందిరా, ఎస్.కె రహీమా బేగం, ధనలక్ష్మి, లలిత, శైలజ బుజ్జమ్మ,విజిత, పద్మ, నందిని తదితరులు పాల్గొన్నారు.