పాత్రికేయుడు ముసుగులో దారుణాలు…

Uncategorized క్రైమ్ సూర్యాపేట

పాత్రికేయుడు ముసుగులో దారుణాలు…

 భూమి ఆక్రమణలకు భార్య రెవెన్యూ ఉద్యోగి భర్త పాత్రికేయుడు.

గండు పిచ్చయ్య చెందిన 1.10సెంట్ల భూమిని 

భూమి ఆన్లైన్ లో పట్టా మార్పిడి 

. భూమిపై బ్యాంకు లోను కూడా . రైతు 

టీవీ5 ఛానల్ పాత్రికేయుడు శ్రీనివాస్ 

మీ::న్యూస్   సుర్య పేట్ జిల్లా ఇంచార్జీ కోల రవీందర్ గౌడ్ 

సూర్యపేట జిల్లా మునగాల మండలం సీతానగరం గ్రామానికి చెందిన ఒక టీవీ ఛానల్ రిపోర్టర్ అనే వ్యక్తి పాత్రికేయ ముసుగులో అనేక దారుణాలకు పాల్పడుతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన గండు పిచ్చయ్య చెందిన 1.10సెంట్ల భూమిని గుట్టుచప్పుడు కాకుండా తన తల్లి మంగమ్మ పేరు మీద ఆన్లైన్ లో పేరు మార్పిడి చేశారు. తను ఒక పాత్రికేయుడునని చలామణి అవుతూ ఆయన భార్య రెవెన్యూ ఉద్యోగి అవ్వడంతో పలుకుబడితో అమాయకుల భూములు ఆన్లైన్ లో మార్పిడి చేసుకున్నారు. అక్రమంగా ఆన్లైన్ లో పేరుమార్పిడి చేసుకున్న భూమిపై బ్యాంకు లోను కూడా తీసుకున్నాడు. రైతు తమకు రైతుబంధు పడటం లేదని అనుమానంతో ఆన్లైన్లో చెక్ చేసుకోగా పల్లపు మంగమ్మ పేరు రావడంతో అవాక్కైనా రైతు పిచ్చయ్య. విషయం తెలుసుకుని పెద్దమనుషులతో కలిసి ఇంటికి వెళితే నేను చెయ్యను నాలుగు నెలల తర్వాత చేస్తా అంటూ తిప్పుతూ నాలుగు నెలలు గా ఇంటి చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోగా రైతుపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు…