మీ న్యూస్ ప్రతినిధి:-ఈనెల 29వ తేదీన బిఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను తాండూర్ నియోజకవర్గ నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మెగా జాబ్ మేళాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ. తాండూర్ నియోజకవర్గ నిరుద్యోగ యువతీ యువకుల కోసం తెలంగాణ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వినాయక కన్వెన్షన్ హాల్లో మెగా జాబ్ మేళా ను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఇందులో దాదాపు 50 కంపెనీలు సుమారు పదివేల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వచ్చాయని తెలిపారు జాబ్ మేళా ఏర్పాటుకు అన్ని సిద్ధం చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ షాప్ నీళ్లను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరు నిరుద్యోగ యువకుల దృష్టికి తీసుకువెళ్లి జాబ్‌కు అప్లికేషన్ చేసే విధంగా తోడ్పడాలని అన్నారు అదేవిధంగా పట్టణంలోని కుల సంఘాలు ఇందులో భాగ్యస్వామ్యం కావాలని ఈ జాబ్ మేళాలను విజయవంతం చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్‌రెడ్డి డిసిసిబి జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ సీనియర్ నాయకులు పట్లోళ్ల నరసింహులు అజయ్ ప్రసాద్ చెన్నారం అనిల్ లింగదరి రవికుమార్ రాము నాయక్ పార్టీ అధ్యక్షులు అభిబ్ లాల గోపాల్ మాజీ కౌన్సిలర్లు ప్రవీణ్ బోయ రవి రాజు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు