ప్రజావాణి లో 63 ధరఖాస్తులు

Uncategorized నల్లగొండ సూర్యాపేట

ప్రజావాణి లో 63 ధరఖాస్తులు

⏩:-ప్రతి ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితమైన సమాధానం తెలపాలి

⏩:-ఇంటర్ మిడియేట్ సప్లమెంటరీ పరీక్షలు మే 22 నుండి 29 వరకు పకడ్బందీగా నిర్వహించాలి

⏩:-ప్రభుత్వ కార్యాలయాల భూముల వివరాలు రికార్డులలో నమోదు చేపించాలి

⏩:-జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

 

 మీ న్యూస్ ప్రతినిధి మే 19:-ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తు క్షుణ్ణంగా పరిశీలించి ఖచ్చితమైన సమాధానం ఆర్జిదారులకి తెలపాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి లో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వె సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తుల పై అధికారులు ఒక కార్యాచరణ రూపొందించుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.ప్రభుత్వ కార్యాలయాలకి సంబందించిన భూముల వివరాలను రెవిన్యూ రికార్డులలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అధికారులకి సూచించారు.మే 22 నుండి 29 వరకు ప్రతి రోజు ఉదయం 9 :00 గంటల నుండి 12:00 గంటల వరకు ఇంటర్ మిడియేట్ మొదటి సంవత్సరం సప్లమెంటరీ పరీక్షలు అలాగే ప్రతి రోజు మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు రెండవ సంవత్సరం సప్లమెంటరి పరీక్షలను అధికారులు సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.

సూర్యాపేట మండలంలో 8 పరీక్ష కేంద్రాలు,కోదాడ మండలంలో 5,హుజూర్ నగర్ లో 1,తిరుమలగిరి మండలం 1 , నడిగూడెం మండలం లో 1 , తుంగతుర్తి లో 1 ,నేరేడు చర్ల మండలం లో 1,మఠంపల్లిలో 1,ఆత్మకూరు (ఎస్ ) లో 1 మొత్తం జిల్లాలో 21 పరీక్ష కేంద్రాలలో 8758 మంది విద్యార్థులు సప్లమెంటరీ పరీక్షలు వ్రాయనున్నట్లు తెలిపారు.పరీక్షలు జరిగే ప్రదేశంలో తహసీల్దార్ 144 సెక్షన్ విధించాలని, పరీక్ష కేంద్రాలకి దగ్గర్లో జిరాక్స్ సెంటర్ లు మూసి వేపించాలని తెలిపారు.పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ అధికారులకి సూచించారు. ఆర్ టి సీ అధికారులు పరీక్ష కేంద్రాలకి ఒక గంట ముందుగానే విద్యార్థులు చేరుకునేలా బస్సులు ఏర్పాటు చేయాలని, వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రతి సెంటర్ లో హెల్త్ క్యాంపు నిర్వహించాలని, విద్యుత్ నిరంతరాయంగా సరఫరా చేయాలని సూచించారు.విద్య సంస్థలకి వేసవి సెలవులు ఉన్నందున పాఠశాల ఆవరణ, టాయిలెట్స్ పరిశుభ్రం చేపించాలని, త్రాగునీటి వసతి ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ చేయకుండా పటిష్టంగా నిర్వహించాలని విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఈ సందర్బంగా కలెక్టర్ ఆకాక్షించారు.ప్రజావాణి కార్యక్రమంలో భూ సమస్య లకి సంబంధించి 27 ధరఖాస్తులు జిల్లా సంక్షేమ అధికారికి 3 ధరఖాస్తులు,జిల్లా పౌర సరఫరాల అధికారికి 3 దరఖాస్తులు, మిగిలిన 30 అర్జీలు వివిధ శాఖలకి సంబంధించి వచ్చాయని మొత్తం 63 ధరఖాస్తులు వచ్చాయని ఆర్జిలను సంబంధిత అధికారులకి పరిష్కరించుట కొరకు పంపటం జరిగిందని ఈ సందర్బంగా కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమం లో డి ఆర్ డి ఓ వివి అప్పారావు,డి ఐ ఈ ఓ భాను నాయక్, డి ఈ ఓ ఆశోక్,డి యం హెచ్ ఓ కోటాచలం, సిపిఓ కిషన్, సంక్షేమ అధికారులు శంకర్, దయానంద రాణి,శ్రీనివాస్ నాయక్, జగదీశ్వర్ రెడ్డి, పరిపాలన అధికారి సుదర్శన్ రెడ్డి, సుపారీటిడెంట్లు సాయి గౌడ్, శ్రీలత రెడ్డి, వినోద్ కుమార్,అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు