జాతరలో విధులు నిర్వహించిన సిబ్బంది కి అభినందనలు తెలిపిన జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్
మీ న్యూస్ ప్రతినిధిసూర్యాపేట జిల్లా ఫిబ్రవరి 21::దురాజుపల్లి పెద్దగట్టు శ్రీ.లింగమంతుల స్వామివారి జాతర ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని, ఎలాంటి అవాంచనీయ సంఘటలు, నేరాలు, ప్రమాదాలు జరగకుండా కృషి చేశామని అన్నారు. జాతరలో జిల్లా పోలీసు సిబ్బంది ముందస్తు ప్రణాళికతో పని చేశారని అభినందించారు. సూర్యాపేట సబ్ డివిజన్ డిఎస్పి రవి, సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్, స్థానిక ఎస్ ఐ మహేశ్వర్ ప్రణాళిక ప్రకారం పని చేశారని అన్నారు. జిల్లా పోలీసు శాఖకు, జిల్లా యంత్రాంగానికి సహకరించిన భక్తులకు, ప్రజలకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి అతి పెద్ద జాతరకు పోలీసు బందోబస్తు చాల ముఖ్యమని ఎస్పి తెలిపారు. ఈ ప్రతిష్టాత్మకమైన జాతర నందు ప్రభుత్వం, పోలీసు ఉన్నతాదికారుల సూచనల ప్రకారం 2000 మంది పోలీసు సిబ్బందిచే మూడు విడతలుగా 24 గంటలు, ఐదు రోజుల పాటు బారి బందోబస్తు నిర్వహించామని అన్నారు. పోలీసు శాఖ ముందస్తు, ప్రత్యేక ప్రణాళికతో జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు, నేరాలు, ప్రమాదాలు జరగలేదని ఎస్పీ తెలిపారు. మఫ్టీ టీమ్స్, క్రైమ్ టీమ్స్, టెక్నికల్ టీమ్స్, కమ్యూనికేషన్ విభాగం, షి-టీమ్స్, స్పెషల్ పార్టిలు, డాగ్ స్కాడ్స్, బాంబ్ స్క్వాడ్స్ ప్రోటోకాల్ ప్రకారం ఈ బందోబస్త్ నందు విధులు నిర్వర్తించినారని, జాతర ప్రదేశంలో పోలీస్ కంట్రోల్ రూమ్ తో పాటు పోలీసు హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటు చేసి భక్తులకు సేవలు అందించాం అన్నారు. జాతర ముగిసినందున జాతీయ రహదారి 65 పై వాహనాలు యదావిదిగా వెళ్తాయి, మళ్ళింపులు అన్ని పునరుద్ధరించడం జరిగినదని అన్నారు. వాహనదారులు వేగంగా వెళ్లకుండా నిదానంగా వెళ్ళాలని కోరారు.