⏩::జాతరకి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గించకుండా చూడాలని
⏩::అధికారులు సమన్వయం చేసుకుంటూ జాతర ని విజయవంతం చేయాలి
⏩::జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు
మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 16::పెద్దగట్టు జాతరకి వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కల్గించకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. ఆదివారం సూర్యాపేట మున్సిపాల్టీ పరిధిలోని దురాజ్ పల్లిలో జిల్లా అదనపు ఎస్పీ నాగేశ్వరావు తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రములో రెండవ అతి పెద్ద జాతర పెద్దగట్టు జాతర అని, ఎక్కువ మొత్తంలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు అందరు సమన్వయం చేసుకుంటూ భక్తులకి దైవ దర్శనం అందేలా చూసి జాతర విజయవంతం అయ్యేలా కృషి చేయాలని సూచించారు.భక్తులకి త్రాగునీరు నిరంతరం సరఫరా చేయాలని, భక్తులకి ఇబ్బంది పడకుండా దుమ్ము లేవకుండా ట్యాంకర్ లతో నీరు చల్లాలని,పారిశుధ్య కార్మికులు ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని సూచించారు.ఆదివారం రాత్రి 9:00 గంటల తర్వాత కేసారం నుండి దేవరపెట్టేను పెద్దగట్టు పైకి తీసుకొచ్చి గుడి చుట్టూ గంపల ప్రదర్శన చేయటంతో జాతర ప్రారంభం జరుగుతుందని తెలిపారు.ఎవరైనా భక్తులు తప్పిపోతే కంట్రోల్ రూమ్ వద్ద కి వచ్చి తెలియజేస్తే మైక్ ద్వారా ప్రకటించటం జరుగుతుందని తెలిపారు.జాతరలో చిన్న పిల్లలతో పని చేపించటం చట్టరీత్యా నేరం అని ఎవరైనా దుకాణాలలో చిన్న పిల్లలతో పని చేపిస్తే చర్యలు తీసుకోవటం జరుగుతుందని అలాంటి వారిని గుర్తించాలని కార్మిక శాఖ అధికారులకి సూచించారు.ఈ కార్యక్రమం లో ఆర్ డి ఓ వేణు మాధవ్,తహసీల్దార్ లు శ్యామ్ సుందర్ రెడ్డి,కృష్ణయ్య, ఆంజనేయులు, అమీన్ సింగ్, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.