నామవరం గ్రామంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు 

Uncategorized తెలంగాణ నల్లగొండ మోతే సూర్యాపేట

నామవరం గ్రామంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు 

మీ న్యూస్ ప్రతినిధి::మండల పరిధిలోని నామవరం గ్రామంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి వై మౌనిక జాతీయ జెండాని ఎగరవేసి గ్రామ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాడు మహానీయులు ఎందరో స్వతంత్రం కోసం తన ప్రాణాల్ని లెక్కచేయకుండా దేశం కోసం పోరాడి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చారని కొనియాడారు వాడు త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ జీవితమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.