జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా బెల్లంకొండ
గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక
మీ న్యూస్ ప్రతినిధి సూర్యాపేట జిల్లా జనవరి 11:::జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన కమిటీని శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాకేష్ డిగ్రీ కళాశాలలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా బెల్లంకొండ రామమూర్తి, గౌరవ అధ్యక్షులుగా కాంపాటి రాధాకృష్ణ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా చిత్తలూరు యాదగిరి గౌడ్, కోశాధికారిగా గుణగంటి వెంకటేశ్వర్లు గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఏలుగూరి కిరణ్ గౌడ్, అసోసియేట్ అధ్యక్షులు గా బెల్లంకొండ రామచంద్రం గౌడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా పబ్బతి వెంకటేశ్వర్లు వ్యవహరించారు. ఈ సందర్భంగా బెల్లంకొండ రామమూర్తి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా సూర్యాపేట జిల్లా లోనే గౌడ ఉద్యోగులు 800 మంది సభ్యత్వం కలిగిన అతి పెద్ద సంస్థ జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం అని తెలిపారు. జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం రిటైర్టు ఉద్యోగులు ఉద్యోగుల సంక్షేమం కొరకు కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. జనాభా ధమాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని, గౌడ ఉద్యోగుల కొరకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో మద్యం దుకాణాలను గౌడ కులస్తులకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.4 డివిజన్ల పరిధిలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా గౌడ ఉద్యోగుల సంఘం నాయకులు సాయిబాబాగౌడ్ వెంకటయ్య గౌడ్ కనకమల్లు గౌడ్ తండు అంజయ్య గౌడ్ ,దేశగాని పాపయ్య గౌడ్, అల్లాడి సత్యనారాయణ గౌడ్, చికూరికృష్ణ గౌడ్, మండవ కృష్ణమూర్తి గౌడ్ సురభి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.