మోతె,మే 25 ( మీ న్యూస్ ప్రతినిధి): స్వేరోస్ విక్టరీ డే సందర్భంగా మోతె మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అక్షరం ఆరోగ్యం ఆర్థికం ఆత్మగౌరం అనే నిదానంతో జ్ఞాన యోధ డాక్టర్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు స్వేరోస్ చీఫ్ కన్వీనర్ బలుగురి దుర్గయ్య ఆధ్వర్యంలో ఘనంగా స్వేరోస్ విక్టరీ డే వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వేరోస్ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లపల్లి శివకృష్ణ,స్వేరోస్ మోతె మండల అధ్యక్షులు దున్నపోతుల దుర్గారావు లు పాల్గొని.మలోవత్ పూర్ణ అతిచిన్న వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన రోజైన మే 25 ను స్వేరోస్ విక్టరీ డేగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు మలావత్ పూర్ణ, ఇచ్చిన స్ఫూర్తితో స్థానిక కేశ్నాల చిన్న గట్టును ఎక్కి అక్కడ జాతీయ జెండాను స్వేరో జెండాను ఎగరేశారు.అనంతరం వారు మాట్లాడుతూ,అణిచివేయబడ ఈ పిల్లల్లో దాగున్న అంతర్గత నైపుణ్యాన్ని ప్రోత్సహించి వెలికి తీస్తే అద్భుతాలు చేస్తారని దానికి మాలోవత్ పూర్ణ,ఆనంద్ ఎవరెస్ట్ అధిరోహించడమే ఉదాహరణ అని, అదే స్ఫూర్తిని గ్రామాలలో ఉన్న నిరుపేద విద్యార్థుల్లో రగిలించడం ద్వారా ప్రోత్సాహం అందిస్తే వాళ్లు కూడా ఎంతటి లక్ష్యాన్ని అయినా సాధించగలరనే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో భాగంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,స్వేరోస్ నెట్వర్క్ చీఫ్ కన్వీనర్ బలుగూరి దుర్గయ్య ఆదేశాలతో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది అని స్వేరోస్ నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్వేరోస్ నాయకులు వెంకటేష్,శ్రీకర్,వెంకటేష్ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.