మీ న్యూస్ సూర్యాపేట జిల్లా జనవరి 08:::::సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండ గ్రామంలో𝗔𝗜𝗞𝗠𝗦 అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత రైతు కూలి సంఘం జాతీయ కమిటీ పిలుపు మేరకు రైతంగ సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమం చేయనైనది. ఈ సందర్భంగా 𝗔𝗜𝗞𝗠𝗦 జిల్లా అధ్యక్షులు పోటు లక్ష్మయ్య అలాగే జిల్లా నాయకులు మేకల కనకరావు మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరించాలని గత43 రోజుల నుండి నిహార దీక్ష చేస్తున్న జగత్ సింగ్ దలియా వాల ఆరోగ్యం రోజురోజుకు క్షీనిస్తున్నది. అతనికి ఏ హాని జరిగిన కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలి. రైతంగా ఉద్యమ సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలు నేటికి నెరవేరలేదు దొడ్డి దారిన నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది రైతు వ్యతిరేక చర్య దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తాం. రైతులకు మద్దతు ధర చట్టాన్ని అమలు అయ్యేంతవరకు పోరాడుతామన్నారు. అలాగే రైతు పండించిన అన్ని రకాల పంటలను మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మా శెట్టి అంజయ్య, చనగాని పెద్ద సాంబయ్య, చెనగాని పర్వతాలు, చమకూరి వెంకటయ్య, కారంగుల బ్రహ్మయ్య, చనగాని సూరయ్య, అరుణోదయ జిల్లా నాయకులు గండు నాగేశ్వరరావు, గండు మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.