ఆటో డ్రైవర్ లు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి

Uncategorized నల్లగొండ సూర్యాపేట

ఆటో డ్రైవర్ లు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి

మీ న్యూస్ జనవరి 08/సూర్యాపేట జిల్లా :::: ఆటో డ్రైవర్ లు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ ఐ సాయిరాం తెలిపారు.రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తా వద్ద ట్రాఫిక్ నియమాలపై ఆటో డ్రైవర్ లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటో డ్రైవర్ లు ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వుండాలని అన్నారు. ప్రతిరోజూ తమ వాహనాల కండిషన్ చెక్ చేసుకోవాలని, ప్రయాణికులను క్షేమంగా గమ్య స్థానాలకు చేర్చాలని అన్నారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, తక్కువ దూరం ఉన్న రాంగ్ రూట్ లో ప్రయాణించవద్దని తెలిపారు. ఆటోలు కెపాసిటీకి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని,రోడ్డు మీద వెళుతున్నప్పుడు ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా డ్రైవింగ్ చేయాలన్నారు.అతివేగం ప్రమాదకరమని, జాతీయ రహదారిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఆటోకు కచ్చితంగా నెంబర్ ప్లేట్ కలిగి వుండాలని, మైనర్ లకు వాహనాల ఇవ్వవద్దని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో పలువురు ఆటో డ్రైవర్ లు, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.