గ్రామ పంచాయితీ కార్మికుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న గ్రామపంచాయతీ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిట్యాల రవిచంద్ర

Uncategorized తెలంగాణ నల్లగొండ నూతన కల్ మోతే రాజాకియం సూర్యాపేట

 

గ్రామ పంచాయితీ కార్మికుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న గ్రామపంచాయతీ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిట్యాల రవిచంద్ర

గ్రామపంచాయతీ కార్మిక సంఘం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల రవిచంద్ర

మీ న్యూస్ ప్రతినిధి డిసెంబర్ 16

సూర్యాపేట జిల్లా మోతే మండలం గ్రామ పంచాయితీ కార్మికులను పర్మినెంట్ చేయాలని , పెరిగన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలని ,ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిసెంబర్ 20 లోపు ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని లేని యెడల నిరవధిక సమ్మె చేస్తామని సూర్యాపేట జిల్లా గ్రామపంచాయతీ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల రవిచంద్ర అన్నారు.

మంగళవారం రోజున గ్రామ పంచాయితీ కార్మికులతో కలిసి హైదరాబాదులో ఇందిరాపార్కు వద్ద జరిగే మహాధర్నాకు వెళుతున్న కార్మికులను ముందుగా అరెస్టు చేయడం జరిగింది ఈ అక్రమ అరెస్టులను వారు ఖండించి మాట్లాడుతూ గ్రామాలలో ఎలాంటి అంటూ వ్యాధులు అనారోగ్యాలు రాకుండా నిత్యం గ్రామంలో పారిశుధ్య కార్మికులుగా ,మంచినీటి సరఫరా, డ్రైవర్స్ గా వివిధ కేటగీలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం అమలు కావడం లేదని కనీసవేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జి ఓ నంబర్ 51 నీ తీసుకువచ్చి మల్టీపర్పస్ విధానం అమలుచేస్తారని వెంటనే ఈ జి ఓ ను సవరించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత సంవత్సరం 34 రోజులు సమ్మె చేసిన సందర్భంలో నేటి ముఖ్య మంత్రి అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని కానీ సంవత్సరం పూర్తి కావస్తున్న నేటికీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని విమర్శించారు.సమస్యలు పరిష్కరించని యెడల ఈనెల 20వ తారీకు నుండి నిరవధిక సమ్మె చేస్తామని వారు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ మండల అధ్యక్షులు బొమ్మగాని వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు పొడపంగి లక్ష్మీనారాయణ కాంపాటి నాగమణి ఎల్లమ్మ జలగంతిరపయ్య వీరయ్య నాగరాజు గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు ఉన్నారు