తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ వార్షిక పరీక్ష షెడ్యూల్ సోమవారం విడుదలైంది.
ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 5 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు జరగను న్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
జనవరి 29న ఇంటర్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, జనవరి 30న పర్యావరణ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జనవరి 31న, సెకండ్ ఇయర్‌కు ఫిబ్రవరి 1న నిర్వహిస్తారు.