కలెక్టర్ అధికారులపై కర్రలతో దాడి బాధాకరం బాధాకరం

Uncategorized కొడంగల్ క్రైమ్ తాండూర్ రాజాకియం వికారాబాద్

కలెక్టర్ అధికారులపై కర్రలతో దాడి బాధాకరం

===ఫార్మ విలేజ్  కంపెనీ  చర్చల కోసం వెళ్లిన కలెక్టర్ 

===లగ్గిచర్ల, పోలేపల్లి, హకీం పేట మూడు గ్రామాల్లో జరిగిన ఘటన

 

 ===జిల్లా కలెక్టర్ అధికారపై దాడి చేయడం సరికాదు

=బషీరాబాద్ మండల అధ్యక్షులు కలాల్ నర్సిములు గౌడ్ 

 

 

 మీ న్యూస్ ప్రతినిధి ::::వికారాబాద్ జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులపై దాడులు చెయ్యడం చాల బాధాకరమని బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కలాల్ నర్సిములు గౌడ్ అన్నారు. వికారాబాద్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గంలో లగ్గిచర్ల, పోలేపల్లి, హకీం పేట మూడు గ్రామాల్లో ఫార్మా గ్రామంలో ఏర్పాటు చేయటం కోసం మూడు వేల ఎకరాల సేకరణ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు .ఈ క్రమంలో చాలామంది రైతులు భూములను స్వచ్చందంగా ఇచ్చేశారు.వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ అధికారులు, పోలీసులు లగ్గిచర్ల గ్రామంలో రైతుల నుండి భూములను సేకరించటం కోసం రెండు కిలో మీటర్ల దూరంలో తాత్కాలిక సభను నిర్వహించటం కోసం ప్రయత్నం చేశారు. అయితే ఇది గ్రామానికి దూరంగా ఉండటం కారణంగా రైతులు, గ్రామస్తులు ఈ సభపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ అధికారులు, పోలీసులు గ్రామానికి వచ్చి ప్రజాభిప్రాయ సేకరణకు ప్రయత్నించగా ఒక్కసారిగా ఆందోళన మొదలైంది.దీంతో పోలీసులు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నేపధ్యంలో కలెక్టర్ ను అక్కడి నుండి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ రాళ్ళ దాడిలో కుడా ప్రత్యేక అధికారి వెంకటరెడ్డికి రాళ్ళు తగలటంతో గాయాలయ్యాయి. ఆయన అక్కడ నుండి పరుగులు పెట్టారు. ప్రస్తుతం ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. కలెక్టర్ అధికారులపై దౌర్జన్యం న్యాయం కాదు అని బషీరాబాద్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కలల్ నర్సిములు గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు