అందరికీ ఆరాధ్యుడు సేవాలాల్ మహారాజ్
– ఊరేంటి తండాలో సేవాలాల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
– బంజార భవన్ కు శంకుస్థాపన చేసిన మనోహర్ రెడ్డి -ఘనంగాతాండూరులో సేవాలాల్ ఉత్సవాలు
దీక్షతెలుగు న్యూస్, తాండూరు :
సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజనుల ఆరాధ్య దైవం మాత్రమే కాదని, అందరికీ ఆరాధ్యుడేనని తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి అన్నారు.
తాండూరు
[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]
- పట్టణంలోని బాలాజీ నర్సింగ్ హోమ్ హాస్పిటల్, పక్కన గురువారం సేవాలాల్ మహారాజ్ 285 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అలాగే పెద్దేముల్ మండలం ఊరేంటి తండాలో ఆయన విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు.ఆయన జయంతి సందర్భంగా తాండూరు మండలం అంతారం గ్రామంలో బంజార భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఈసందర్భంగా ఎమ్మెల్యేమాట్లాడుతూ..గిరిజన , సంస్కృతి, సాంప్రదాయాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు.సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో తప్ప దేశంలో ఇంకెక్కడా జరపడం లేదంటే ఇది మన రాష్ట్ర గొప్పతనమన్నారు. తాండూరులో అన్ని కులాలు,
మతాలు,సమానంగాగౌరవిస్తూసాంప్రదాయాలు, ఆచారాలను కాపాడుతున్నారని తెలిపారు.త్వరలో తాండూరులో 2 కోట్లతో బంజారా భవనం నిర్మించుకుందన్నారు.ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ స్వప్న,జిల్లా మాజీ గ్రంధాలయం చైర్మన్ మురళి కృష్ణ గౌడ్,డ్రాక్టర్ సంపత్ కుమార్, ధారాసింగ్ నాయక్ ,విట్టల్ నాయక్, వాస్ పవర్ నాయక్,ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.