మీ:న్యూస్ ప్రతినిధి బొమ్రాజ్ పేట:ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని కిసాన్ బంధు సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ అన్నారు. బొమ్రాజ్ పేట కొడంగల్ మండలాల పరిధిలోని సూర్య నాయక్ తండ ఎంకేపల్లి ఇందిరానగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా కిసాన్ బంద్ సంస్థ ఆధ్వర్యంలో బ్యాగులు అభ్యసన సామాగ్రి ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిసాన్ బంద్ సంస్థ నుంచి పలు రకాల సేవా కార్యక్రమాలు కొడంగల్ ప్రాంతంలో కొన్నేళ్లుగా చేస్తున్నామని ఆయన అన్నారు. కిసాన్ బంద్ నుంచి అందిస్తున్న ఉచిత సేవలను పాఠశాలల్లోని ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులకు సద్వినియోగం అయ్యేలా చొరవ చూపాలని ఆయన అన్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ నుంచి కరోనా కాలంతోపాటు కొన్నాళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు, నిరుపేద కుటుంబాలకు అనాధలకు, రోగులకు పలు రకాల ఉచిత సేవలు అందిస్తున్నారని కిసాన్ బంధు సంస్థను ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వ ఆసుపత్రులకు పలు రకాల పేద కుటుంబాలకు ఉచితంగా వస్తువులు నగదు తదితర సేవలను అందిస్తూ కిసాన్ బంధు సేవలను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ బంధు సంస్థ ప్రతినిధులు సువర్షల, నిత్య, సాయి జై వంతు, తారక్, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు గౌరారం గోపాల్ వాకారం చంద్రశేఖర్ అనిల్ కుమార్, మండల నోడల్ అధికారి హరిలాల్ చౌదర్పల్లి క్లస్టర్ రవీందర్ గౌడ్, హెచ్ఎంలు రహీం నవీన్ ఉపాధ్యాయులు శ్రీనివాస్ జ్యోతి పాల్గొన్నారు.