schedule Saturday, June 13, 2026

ప్రజావాణి ప్రజల సమస్యలకు పరిష్కారం

calendar_today April 21, 2025
person meenewstelugu

ప్రజావాణి ప్రజల సమస్యలకు పరిష్కారం

⏩::సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయం

మీ న్యూస్ ప్రతినిధి:శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటూ ఫిర్యాదుల పై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీకె నరసింహ అన్నారు.  సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పిర్యాదు దారులతో మాట్లాడి వారి అర్జిలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పిర్యాదుదారులకు బరోసా కల్పించాలని, ప్రతి అంశాన్ని చట్ట పరిదిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు.