మోతే గ్రామాలలో ఉపాధి హామీ పనులను బంద్ 

Uncategorized మోతే సూర్యాపేట

విబి జి రాంజీ చట్టం రద్దు చెయ్యాలి.

గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి పునరుద్దించాలని 

అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీ పిలుపు

మీ న్యూస్ సూర్య పేట్ జిల్లాప్రతినిధి:::తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు జంపాల స్వరాజ్యం మోతె :గ్రామీణ ఉపాధి హామీ కూలీల బకాయలు విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కమిటీ సభ్యురాలు జంపాల స్వరాజ్యం డిమాండ్ చేశారు. శుక్రవారం అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీ పిలుపులో భాగంగా మండల పరిధిలోని సిరికొండ, రాఘవాపురం, బుర్కా చర్ల, మోతే గ్రామాలలో ఉపాధి హామీ పనులను బంద్ చేశారు. అనంతరం పని ప్రదేశంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా చేసిన అనేక పోరాటాల ఫలితంగా పార్లమెంట్ లో వామపక్షాలు మద్దతుతో యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ పేదలకు ప్రతి కుటుంబానికి వంద రోజుల పని గ్యారెంటీ చేస్తూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని 2005లో ఆమోదించదన్నారు. 2006 అక్టోబర్ 2 నుండి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారని చెప్పారు. దీని ద్వారా కోట్లాదిమంది వ్యవసాయ వ్యవసాయ కార్మికులకు , చిన్న, మధ్య తరగతి రైతాంగానికి చేతినిండా పని కల్పించబడిందన్నారు.గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు పని కోసం పేదల వలసలు తగ్గాయన్నారు. గ్రామీణ వ్యవసాయ కార్మికులు వ్యవసాయ పనులలో కనీస వేతనాలను పెంచుకోవడం జరిగిందన్నారు . ఆడ,మగ తేడా లేకుండా సమాన వేతనాలు దేశంలో మొదటిసారి అమలు జరిగాయ అన్నారు. కోట్లాది రూపాయలను కేంద్ర ప్రభుత్వం వేతనాల రూపంలో పేదలకు ఇవ్వడం వలన ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని చెప్పారు. పేదరికం, అప్పుల ఊబి నుండి కోట్లాది నిరుపేద కుటుంబాలు బయటపడ్డాయని గుర్తు చేశారు. 2008లో ప్రపంచంలో ఆర్థికమాంద్యం వచ్చినప్పుడు భారతదేశాన్ని గట్టెక్కించినది గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని నొక్కి చెప్పారు.

పట్టణ ప్రాంతాల పేదలకు ఉపాధి పని పెట్టాలని డిమాండ్ చేశారు. 100 రోజుల పని దినాలను 200 రోజులకు పెంచాలని కోరారు.రోజు కూలి రూ. 600 ఇవ్వాలని దేశవ్యాప్తంగా ఆందోళన, పోరాటాలు ఉదృతం అవుతున్న తరుణంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసిందన్నారు. దీని స్థానంలో విబిజి రామ్ జి చట్టాన్ని తెచ్చిందని,గతంలో 90% నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం 60 శాతం మాత్రమే ఇస్తాము 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని నిర్ణయం చేసిందన్నారు . పని దినాలను 125 రోజులకు పెంచినట్లే పెంచి వ్యవసాయ సీజన్ లో 60 రోజుల పనిని బంద్ చేస్తామని పేర్కొంది అన్నారు. కనీస వేతనం రోజు కూలి రూ 178 గా పేర్కొన్నదని,ఇది రాజ్యాంగబద్ధ పని హక్కును హరించడమే అని అన్నారు. పని కల్పించే బాధ్యత నుండి కేంద్ర ప్రభుత్వం తప్పకో చూస్తున్నదని ఆరోపించారు.

రోజు కూలి రూ. 307 ఇవ్వాలి కానీ రూ 150 మించి పడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు . వీటిని కూడా అనేక గ్రామాలలో గత సంవత్సరం చేసిన పనికి ఇప్పటివరకు వేతనాలు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు చేస్తున్న పనికి నాలుగు వారాలుగా వేతనాలు ఇవ్వలేదని చెప్పారు.వారం వారం కూలీల వేతనాలు ఇవ్వాలి అనే చట్టం డైరెక్షన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని విమర్శించారు.ఎండలు తీవ్రంగా పెరుగుతున్నాయి కానీ పని ప్రదేశంలో త్రాగడానికి నీరు, నీడకు టెంటు, ఓ ఆర్ ఎస్, మెడికల్ కిట్ వంటికనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బిజెపి ప్రభుత్వం పేదలపై కక్షగట్టి పనిని తీసివేయాలని చూస్తున్నదని అందులో భాగమే అని ప్రదేశంలో ఉదయం సాయంత్రం ఫోటోలు ఆన్ లైన్ లో అప్లోడ్ చేయడానికి నేషనల్ మొబైల్ మోనటరింగ్ సిస్టం తెచ్చిందని అన్నారు.అడవులు గుట్టలలో పని దగ్గర ఫోన్ సిగ్నల్స్ సరిగా లేక ఫోటోలు అప్లోడ్ కాకపోవడం ఫలితంగా పని చేసిన కూలీలు పనికిరాని వారుగా రికార్డులలో నమోదు అవుతున్నది. మరొకవైపు డ్రోన్ యంత్రం ద్వారా ఫోటోలు తీస్తున్న వాటిని లెక్కలోకి తీసుకోవడం లేదన్నారు. కొత్తగా ఐరిస్ ఫోటోలుతీస్తామంటున్నారని,మెట్ల వ్యవస్థను రద్దు చేశారని అన్నారు. పని దినాలు తక్కువ పేరుతో అసిస్టెంట్లను తీసి వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఆధార్ కార్డు , జాబ్ కార్డు , బ్యాంకు ఎకౌంటు నంబర్ల లింకు పేరుతో లక్షలాదిమంది జాబ్ కార్డు లను తొలగించాలని అన్నారు. నిధులలో భారీ కోత విధించారని అన్నారు. ఆన్లైన్ పేమెంట్ పేరుతో వేతనాలను పెండింగ్ లో పెడుతున్నారని,తక్షణమే ఈ విధానాలను రద్దు చేయాలని,అడిగినవారికి జాబ్ కార్డు ఇవ్వాలని కోరారు.కూలీల పొట్ట కొట్టే విబిజీ రాం జీ చట్టం రద్దు చేయాలని అన్నారు.పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని అన్నారు.పట్టణ పేదలకు ఉపాధి పని కల్పిస్తాం పని దినాలను 150 రోజులకు పెంచుతాం , రోజు కూలి రూ 400 ఇస్తాం అన్న కాంగ్రెస్ ప్రభుత్వం హామీ లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మేకల ఉపేందర్, మండల నాయకులు బూడిద లింగయ్య, కొండ రాములు, కాంపాటి శ్రీను, ఉపాధి కూలీలు మల్లమ్మ, కవిత, వెంకన్న, జ్యోతితదితరులు పాల్గొన్నారు.