తాండూరు ఇందిరా నగర్ రామాలయ పునః ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

Uncategorized తాండూర్ వేడుకలు

నూతనంగా పునర్నిర్మించిన రామాలయం ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు

 * ఈ నెల 23 నుండి ఐదు రోజుల పాటు వైభవంగా వేడుకలు

 

 * పునర్నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు

 * భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ పిలుపు..

మీ న్యూస్ తాండూర్ టౌన్ ::::తాండూరు పట్టణంలోని ఇందిరా నగర్‌లో నూతనంగా పునర్నిర్మించిన రామాలయం పునః ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఈ నెల 23వ తేదీ నుండి అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి. భక్తులందరి సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా నిర్మితమైన ఈ ఏకైక రామాలయ వేడుకల వివరాలను ఆలయ ప్రతినిధులు వెల్లడించారు. పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఈ నెల 23వ తేదీన ఉదయం 6 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం ఉదయం 7 గంటలకు భద్రప్ప హనుమాన్ దేవాలయం నుండి నూతన రామాలయం వరకు మూల విరాట్ల శోభాయాత్ర నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ యాత్ర భద్రేశ్వర్ చౌక్, గాంధీ చౌక్, మర్రిచెట్టు, వివిహెచ్ఎస్, శివాజీ చౌక్ మరియు పాండురంగ దేవాలయం మీదుగా సాగి ఆలయానికి చేరుకుంటుంది పేర్కొన్నారు. అదేవిదంగా మార్చి 24: ఆలయంలో శాస్త్రోక్తంగా వివిధ హోమాలు, పూజా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. మార్చి 25: అత్యంత కీలకమైన విగ్రహ ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనతో పాటు సీతారామచంద్ర మూర్తుల మరియు వీరాంజనేయ స్వామి ప్రతిష్ఠాపనలు నిర్వహించనున్నామని తెలిపారు.

 మార్చి 26: కళ్యాణోత్సవానికి సన్నాహక కార్యక్రమంగా ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా జరుగుతుందన్నారు.

మార్చి 27: లోక కళ్యాణార్థం శ్రీ సీతారామచంద్ర మూర్తుల కళ్యాణోత్సవంతో వేడుకలు ముగుస్తాయని వెల్లడించారు.

ఈ ఐదు రోజుల ఆధ్యాత్మిక వేడుకల్లో తాండూరు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, భజన కీర్తనలతో ఈ మహత్కార్యాన్ని దిగ్విజయం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు. ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలని వారు విజ్ఞప్తి చేశారు…