ప్రమాదకరమైన బావిని పూడ్చివేయాలి

Uncategorized నల్లగొండ మునుగాల మోతే సూర్యాపేట

ప్రమాదకరమైన బావిని పూడ్చివేయాలి

 

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ది సంఘం పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విప్లవరాజు

మీ న్యూస్ మోతె మండల ప్రతినిధి,జనవరి 16:::మోతె మండల కేంద్రం నుండి మునగాల మండలం నరసింహుల గూడెం వెళ్లే రహదారిలో రోడ్డు పక్కనే ఉన్న ప్రమాదకరమైన బావిని వెంటనే పూడ్చివేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విప్లవరాజు ఓ ప్రకటనలో తెలిపారు వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రమాదకరమైన బావి దగ్గర ఎన్నో ప్రమాదాలు అయ్యాయని సంబంధిత అధికారులకు తెలియచేసిన కూడా పట్టించుకోని పరిస్థితి ఉందని వారు తెలిపారు అదేవిధంగా ఎంతో రద్దీగా ఉండే ఈ రహదారి ఈ భావి వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని బావి వల్ల ఇంకా మరెన్నో ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉన్నదని అంతేకాకుండా ఈ బావి దగ్గర ఎలాంటి సూచనలు ఎలాంటి బోర్డులు ఆర్ అండ్ బి అధికారులు ఏర్పాటు చేయలేదని వారు అన్నారు ఇప్పటికైనా ఈ ప్రమాదకరపు బావిని పూడ్చివేసి ప్రమాదాలను నివారించే దిశగా ఆర్ అండ్ బి అధికారులు చొరవ చూపాలని వారు డిమాండ్ చేశారు