నకిలీ డాక్టర్లు, ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి

Uncategorized రాజాకియం సూర్యాపేట

నకిలీ డాక్టర్లు, ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి

 ప్రైవేటు ఆసుపత్రుల్లో దోపిడీని అరికట్టాలి

 తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్

మీ న్యూస్ ప్రతినిధి:: సూర్యాపేట: ఎలాంటి అనుమతులు, అర్హతలు లేకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ డాక్టర్లు, ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల ప్రైవేటు ఆసుపత్రులు పుట్టుకొస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్నాయని ఆరోపించారు. నకిలీ డాక్టర్లు, రేడియోలజిస్టులు రోజురోజుకు పెరుగుతున్నారని అన్నారు. నకిలీ డాక్టర్లు, రేడియోలజిస్టుల మామూళ్లకు అలవాటుపడ్డ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సహకరిస్తున్నారని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులు తమ ఇష్టానుసారం ఓపి ఫీజులు పెంచుకుంటూ మందులు, టెస్టులు, బెడ్ చార్జి పేరుతో వేలాది రూపాయలు ప్రజల నుండి బలవంతంగా దండుకుంటున్నారని అన్నారు. శాంపిల్స్ మందులు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని హరించి వేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నిద్ర మత్తు వదిలి ప్రైవేటు ఆసుపత్రుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ప్రజా ఆరోగ్యాన్ని రక్షించాలని కోరారు. లేనియెడల ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పులుసు సత్యం ఉన్నారు.