ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేయాలి

Uncategorized తెలంగాణ నల్లగొండ సూర్యాపేట

ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేయాలి

విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి

అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగంగా మద్యం సేవించడంపై కఠిన చర్యలు తీసుకోవాలి

పిర్యాదులను అంతర్జాలంలో నమోదు చేయాలి, రశీదు ఇచ్చి సత్పరం స్పందించాలి

సూర్యాపేట జిల్లా ఎస్పి నర్సింహా

 

మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట జిల్లా ఎస్పీ శ్రీ నరసింహ మంగళవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసారు. పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించి ఫిర్యాదుల నిర్వహణను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదును రిజిస్టర్ నందు నమోదు చేయాలి, ఫిర్యాదుదారులతో గౌరవంగా, మర్యాదగా నడుచుకుంటూ వారికి పోలీసు సేవలపట్ల నమ్మకం కలిగేలా త్వరితగతిన ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేసి బాధితులకు భరోసా కల్పించాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ నిర్వహణ, వివిధ కేసులలో స్వాధీనం చేసుకున్న వాహనాలు ఇతర సామాగ్రి పరిశీలించారు. సీసీ కెమెరా కంట్రోల్ సెంటర్ ను పరిశీలించారు. పట్టణంలో సీసీ కెమెరాలు ఎక్కువగా ఏర్పాటు చేయాలి, సిసి కెమెరాల యొక్క ఉపయోగం ప్రజలకు వివరించాలన్నారు. రౌడీ షీటర్స్ పై, ల్యాండ్ గ్రాబర్స్ పై నిఘా ఉంచాలి ఇలాంటి వారి నుండి ప్రజలకు ఇబ్బందులు కలిగినట్లు పిర్యాదులు వస్తె వ్యక్తులు ఎంతటివారైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలవాటుగా నేరాలకు పాల్పడే వారిపై, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు.జిల్లా కేంద్రంలో పెరుగుతున్న ప్రజల రద్దీ వాహనాల రద్దీ దృష్ట్యా పోలీస్ శాఖ అత్యంత వేగంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. వాహనాలు నడుపుతూ ఇతరులను ఇబ్బందులకు గురి చేసే విధంగా పెద్ద శబ్దాలతో వాహనాలు నడిపే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని వాహనాలు సైతం సీజ్ చేయాలన్నారు.పట్టణంలో నిరంతర తనిఖీలు నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పల్పడేవారిపై, బహిరంగంగా మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలి అన్నారు. రాత్రిళ్ళు పెట్రోలింగ్ నిర్వహిస్తూ కొత్త వ్యక్తులు, అనుమానస్పద వ్యక్తుల కదలికలు గమనించాలని అన్నారు. జాతీయరహదారి వెంట ఎక్కడపడితే అక్కడ వాహనాలు ఆపితే ఎన్ఫోర్స్మెంట్ కేసులు చేయాలని ఆదేశించారు.పోలీసు సిబ్బందితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియపరచాలి, అందరూ కలిసి పని చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వీర రాఘవులు,ఎస్ ఐ లు ఆంజనేయులు, సైదులు, ఏడుకొండలు,ప్రవీణ్ సిబ్బంది ఉన్నారు.