చాట్ల మధు కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది
బిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు శీలం సైదులు యాదవ్
మీ న్యూస్ ఏప్రిల్ 3::మోతె మండలం లోని రావిపహాడ్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు చాట్ల మధు తండ్రి చాట్ల ముత్తయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం అత్యంత బాధాకరమని బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శీలం సైదులు యాదవ్ అన్నారు వారి కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించి వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాట్ల ముత్తయ్య లేని లోటు ఎవరు తీర్చ లేనిదని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం చాట్ల మధుకు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది అని భరోసాను ఇచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ఏలూరు వెంకటేశ్వరరావు మండల నాయకులు మిక్కిలినేనిసతీష్ మండల యువజన అధ్యక్షులు జాన్ పాషా మాజీ సర్పంచ్ కోటేష్ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు కుక్కడపు భిక్షం కోడి లింగయ్య యాదవ్ చిట్లింకి వెంకన్న యాదవ్ పెరుగు భద్రయ్య యాదవ్ పెరుగు లింగయ్య యాదవ్ యువ నాయకులు చాట్ల ప్రభంజన్, మండల పార్టీ యూత్ ఉపాధ్యక్షులు పొడపంగి వేణు గజ్జి కరుణాకర్ బిఆర్ఎస్వి మండల పార్టీ అధ్యక్షుడు దోసపాటి నరేష్ కలకొండ చంటి బత్తెం నవీన్ తది తరులు పాల్గొన్నారు