స్థానిక సంస్థల్లో వికలాంగులకు  స్థానం కల్పించాలి

Uncategorized కొడంగల్ తెలంగాణ రాజాకియం వికారాబాద్

స్థానిక సంస్థల్లో వికలాంగులకు  స్థానం కల్పించాలి

 

⏩::చట్ట కోసం సాధనకై దశల వారీగా ఉద్యమం

 

⏩::రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేయాలి

⏩::గ్రామపంచాయతీ,మున్సిపాలిటీ,మండల పరిషత్, జిల్లా పరిషత్లలో ఇద్దరు వికలాంగులను నామినేట్ 

 

మీ న్యూస్ ప్రతినిధి::వికారాబాద్ జిల్లాలోని దోమ మండల్ గుండాల్ గ్రామంలో సంతకాల సేకరణ చేయడం జరిగింది.NPRD జిల్లా అధ్యక్షులు జె. దశరథ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గ్రామపంచాయతీ,మున్సిపాలిటీ,మండల పరిషత్, జిల్లా పరిషత్లలో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేయడానికి వీలుగా ప్రత్యేక చట్టం చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక NPRD జిల్లా అధ్యక్షుడు జె.దశరథ్ మండల ఉపాధ్యక్షులు కోళ్ల గోపాల్ లు డిమాండ్ చేశారు.ఈ రోజు దోమ మండలంలోని గుండాల్ గ్రామంలో స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ మార్చి 1నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న లక్ష సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా గుండాల్ గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ* తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ డిసెబుల్డ్ స్టడీస్ రిపోర్ట్ ప్రకారం 43.02 లక్షల మంది (రాష్ట్ర జనాభాలో 12.02 శాతం) వికలాంగులున్నారు.రాష్ట్రంలో 2024 డిసెంబర్ నాటికి 12769 గ్రామ పంచాయతీలు, 130 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్స్, 540 మండల పరిషత్లు,32 జిల్లా పరిషత్లు ఉన్నవి. ఇప్పటికే రాజస్థాన్, చత్తీస్గడ్ రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల్లో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేయడానికి ప్రత్యేక చట్టాలు చేసి అమలు చేస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున పంచాయతీ రాజ్ చట్టానికి మరియు మున్సిపల్ చట్టానికి సవరణలు చేసి,ఇద్దరు వికలాంగులను నామినేట్ చేసేందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018,తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లలో సవరణలు చేసి, ప్రత్యేక చట్టం చేసి వికలాంగులకు అవకాశాలు కల్పించాలని కోరుతున్నాము. స్థానిక సంస్థల్లో ఇద్దరు వికలాంగులను నామినేట్ చేస్తే గ్రామ పంచాయతీలలో 25,538 మందికి, మున్సిపాలిటీలలో 260 మందికి, మున్సిపల్ కార్పొరేషన్లలో 26 మందికి,మండల ప్రజా పరిషత్ లలో 1080 మందికి, జిల్లా పరిషత్లలో 64 మందికి రాజకీయ అవకాశాలు వస్తాయి.రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 26,968 మందిని నామినేటెడ్ చేయడానికి అవకాశం ఉంది.కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థానిక సంస్థల్లో వికలాంగులకు(నామినేట్ ) ప్రతినిత్యం కల్పిస్తూ అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేసి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ అమలు చేయడానికి అసెంబ్లీలో చట్టం చేస్తామని ప్రకటించడం జరిగిందని అన్నారు.2025 మార్చి 1 నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంతకాల సేకరణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎం కృష్ణయ్య, టి లక్ష్మి. ఎం సుశీల. టి సునీత. శ్రీనివాస్. పార్వతమ్మ. జంగయ్య. గోపాల్. దస్తమ్మ అంజలయ్య. అనురాధ. చంద్రయ్య. డి పద్మమ్మ. సావిత్రి. అమృత,కోళ్ల గోపాల్ మండల ఉపాధ్యక్షులు పాల్గొన్నారు