గుండెపోటుతో మృతి చెందిన ఉపాధి కూలీని ప్రభుత్వo ఆదుకోవాలి

Uncategorized క్రైమ్ తెలంగాణ నల్లగొండ మోతే సూర్యాపేట

గుండెపోటుతో మృతి చెందిన ఉపాధి కూలీని ప్రభుత్వo ఆదుకోవాలి

::వ్య.కా.సం.నేత ధనుంజయనాయుడు విజ్ఞప్తి

 

⏩::మీ న్యూస్ సూర్యాపేట జిల్లా స్టాప్ రిపోర్టర్ కోల రవీందర్ గౌడ్ 9640 6595 60

 

మీ న్యూస్ ప్రతినిధి మార్చి 5::

సూర్యాపేట జిల్లా మోతే మండలం కూడలి గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన ఉపాధి కూలి నిమ్మరబోయిన మహేష్ ను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం నాడు ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం(B K M U అనుబంధo) సంఘం కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ.. ఉపాధి పనికి వెళ్లి ఎండకు తాళలేక ఇంటి వద్దకు వచ్చి మృతి చెందాడని అందువల్ల మహేష్ కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగ అవకాశము కల్పించాలని, ఆయన డిమాండ్ చేశారు..నిన్న మోతే మండలం సందర్శించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్…. పని ప్రదేశంలో మంచినీరు టెంటు ఏర్పాటు చేయాలని సూచన చేశారని జిల్లాలో ఎన్ని చోట్ల పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారో ఏపీవోలు సమాధానం చెప్పాలని గతంలో కొన్ని వందలసార్లు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పని ప్రదేశాలలో పరిశీలించి… ఉపాధ పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలైన మంచినీరు టెంట్ మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేసినప్పటికీ అధికారులు చెవిలో పెట్టకపోవడం వలన మహేష్ దుర్మరణం పాలయ్యాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . ఉపాధి కూలీలకు ఈ వేసంగిలో ఊరికి రెండు కిలోమీటర్ల దూరంకంటే ఎక్కువ దూరం ఉంటే కూలీలకు ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఉపాధి కూలీలందరికీ 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.ఆయన వెంట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రెమిడాల రాజు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి ఎగ్బాల్ ఉన్నారు