సూర్యాపేట జిల్లా మీ న్యూస్ ప్రతినిధి 22 ::సూర్యాపేట రూరల్: గత కొంతకాలంగా పిల్లలమర్రి శివాలయం అర్చకులుగా పనిచేసిన నందీశ్వర్ శర్మ అలియాస్ నందయ్యను అర్చకులుగా తొలగించినట్లు పిల్లలమర్రి శివాలయాల చైర్మన్ గవ్వ వెంకటకృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పలు ఆరోపణలతో ఆయనను తొలగించినట్లు చెప్పారు. ఈ విషయమై సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సైతం చేసినట్లు పేర్కొన్నారు. శివాలయాల్లో పూజలు, శివరాత్రి ఉత్సవాలలో దాతల భాగస్వామ్యంకై పూర్తి వివరాలకు చైర్మన్ ఫోన్ నెంబర్ 9182581579 సంప్రదించాలని కోరారు.