బీసీ మహిళా నూతన కార్యవర్గ సమావేశం

Uncategorized తాండూర్ రాజాకియం వికారాబాద్

బీసీ మహిళా నూతన కార్యవర్గ సమావేశం

జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ 

✒️..రాజకీయ పార్టీలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయి జాగ్రత్త

✒️..తాండూర్ నుండి ఢిల్లీ దాకా ఉద్యమిద్దాం

✒️..జనరల్ స్థానాల్లో బీసీ మహిళలు పోటీ చేయాలి

✒️..బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసే శక్తి మహిళలకు ఉంది

✒️..బీసీ మహిళా కార్యవర్గ సమావేశంలో బీసీ నేత రాజ్ కుమార్   

✒️….తాండూర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు అనిత 

✒️..రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకుర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి

✒️..జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ 

 

 

 తాండూర్ టౌన్ మీ న్యూస్ ప్రతినిధి::పట్టణంలో తాండూర్ నియోజకవర్గ బిసి మహిళా అధ్యక్షురాలు కే అనిత ఆధ్వర్యంలో బీసీ మహిళా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజకుమార్ మాట్లాడుతూ 77 సంవత్సరాల భారత స్వతంత్ర దేశంలో బీసీలకు సమాన వాట దక్కలేదని నేటికీ అగ్రకులాలే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఎదిగారని బీసీలను మాత్రం బిచ్చగాళ్ళగానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీసీలకు సమానవాట దక్కాలంటే పార్టీలు కుల మతాలను పక్కనపెట్టి సమిష్టిగా ఉద్ధమించాలని రాజాధికారం సాధన కోసం ప్రతి మహిళ తమ వంతు కృషి చేయాలని కోరారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోట మహిళలు పోటీ చేయాలని వారికి బీసీ సంఘం మరియు జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మద్దతు లభిస్తుందని తెలిపారు రాజకీయ పార్టీలు బీసీలను కేవలం ఓటు బ్యాంక్ అనే చూస్తున్నాయని అన్ని రాజకీయ పార్టీలు బీసీ నినాదంతో మోసం చేస్తున్నాయని బీసీ కులాల మధ్య చిచ్చు పెడుతున్నాయని బీసీలు అందరూ జాగ్రత్తగా గమనించాలని రాజ్ కుమార్ అన్నారు. జిల్లా బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకూర్ మహిళా నియోజవర్గ అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ బీసీలను సంఘటితం చేసే శక్తి మహిళలకు ఉందిని బిసి జాతీయ నాయకత్వం ఏ కార్యక్రమం తీసుకున్న తాండూర్ నుండి ఢిల్లీ వరకు పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని బీసీల ఐక్యమత్యంగా ఉన్నామని చెప్పడానికి నేటి కార్యవర్గ సమావేశం ఒక ఉదాహరణగా నిలుస్తుందిని మహిళలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీ నాయకులకు భయపడకుండా బీసీ ఉద్యమంలో పాల్గొని చరిత్రలో నిలిచిపోవాలని అన్నారు.

నూతన కార్యవర్గం ఎన్నిక జిల్లా మహిళా కార్యదర్శిగా లక్ష్మీనర్సమ్మ తాండూర్ డివిజన్ ఉపాధ్యక్షులుగా మహిళా ఉప అధ్యక్షురాలుగా మంజుల విజయలక్ష్మి కార్యదర్శిగా జగదీశ్వరి లకు జాతీయ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ జిల్లా అధ్యక్షులు మధులత శ్రీనివాస్ చారి రాష్ట్ర నాయకులు సయ్యశుకుర్ నియామక పత్రాలు అందజేశారు నూతనంగా ఎన్నికైన మహిళా కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర నాయకులు సయ్యద్ సుకూర్ బిసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మధులత శ్రీనివాస్ చారి జిల్లా మహిళా సంఘం కార్యదర్శి నరసమ్మ మహిళా సంఘం తాండూర్ డివిజన్ అధ్యక్షురాలు అనిత ఉపాధ్యక్షురాలు మంజుల విజయలక్ష్మి కార్యదర్శి జగదీశ్వరి బిసి ఉద్యమ నాయకురాలు నాయి కోటి జ్యోతి బషీరాబాద్ మహిళా అధ్యక్షురాలు వీరమని పెద్ద మండల అధ్యక్షురాలు శివ లీల బీసీ సంఘం మండలాల అధ్యక్షులు నరేందర్ ముదిరాజ్ లక్ష్మణాచారి శ్రవణ్ ముంబాపూర్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ బీసీ విద్యార్థి నాయకుడు యాసర్ సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్ బిసి యువ నాయకులు రాము ముదిరాజ్ శివ గిరిజపురం రమేష్ పరమేష్ నాయి వివేక్ మరియు తాండూర్ పట్టణానికి చెందిన మహిళలు పెద్దముల్ యాలాల్ బషీరాబాద్ తాండూరు మండలాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు