మీ న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 6::విద్యార్థి దశలో ఒదిగి ఉన్నపుడే మాత్రమే జీవితంలో ఎదుగుతారని అలా ఎదిగినవాడే డాక్టర్ దారావత్ రాజేష్ అని గాయకుడు, విద్యావేత్త, భవిష్య విద్యాసంస్థల డీన్ కొంపెల్లి దశరథ అన్నారు.తాను గతంలోపనిచేసిన లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాలలో మోతే మండలం లక్ష్మి నాయక్ తండాకు చెందిన ధరావత్ రాజేష్ ఇంటర్మీడియట్ చదివి ఎంబిబిఎస్ సీటు సంపాధించి మెడిసిన్ చేసి ఆతర్వాత ఉన్నత చదువులు చదివి నేడు తన సొంత మండ లానికే మెడికల్ ఆఫీసర్ గా వచ్చిన విషయాన్ని తెలుసు స్వయంగా హైద్రా బాద్ నుండి సూర్యాపేట కు విచ్చేసి ఎంతో ఎత్తు ఎదిగిన చిన్న నాటి తన ప్రియ శిష్యుణ్ణి న్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజేష్ చదివే రోజుల్లో ఎంతో వినయంగా ఉండేవాడని అతని సంస్కారాన్ని చూసి నేను, నా సహచర అధ్యాపకులు కరస్పాండెంట్ తుక్కని మన్మధ రెడ్డి ఇతను జీ వితంలో ఎంతో ఎత్తు ఎదుగుతారని ఊహించామని, అట్టి కలను నిజంచేసిన రాజేష్ నేటి విద్యార్థి లోకానికి ఆదర్శ నియుడని అన్నారు. సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయులు గా పనిచేసిన దశరథ సార్ జీవితంలో గొప్పగా ఎదిగి మనం బతుకుతూ కొంతమందికి తోడ్పాటు అందించినప్పుడే జీవితానికి సార్ధకత ఉంటుందని చెప్పిన మాటలు నా మీద ఎంతో ప్రభావం చూపాయని అందుకే వైద్యరంగాన్ని ఎంచుకొని నా వంతు ప్రజలకు సేవ చేసి జన్మభూమి రుణం తీర్చుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవిష్య విద్యాసంస్థల అడ్మినిస్ట్రేటర్ ఎన్.చంద్రశేఖర్ సూర్యాపేట ఏజీఎం నామాల గురుమూర్తి నల్గొండ ఏజిఎం వీరేష్ వైస్ ప్రిన్సిపాల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.విద్యార్థి దశలో ఒదిగి ఉన్నపుడే మాత్రమే జీవితంలో ఎదుగుతారని అలా ఎదిగినవాడే డాక్టర్ దారావత్ రాజేష్ అని గాయకుడు, విద్యావేత్త, భవిష్య విద్యాసంస్థల డీన్ కొంపెల్లి దశరథ అన్నారు.తాను గతంలోపనిచేసిన లిటిల్ ఫ్లవర్ జూనియర్ కళాశాలలో మోతే మండలం లక్ష్మి నాయక్ తండాకు చెందిన ధరావత్ రాజేష్ ఇంటర్మీడియట్ చదివి ఎంబిబిఎస్ సీటు సంపాధించి మెడిసిన్ చేసి ఆతర్వాత ఉన్నత చదువులు చదివి నేడు తన సొంత మండ లానికే మెడికల్ ఆఫీసర్ గా వచ్చిన విషయాన్ని తెలుసు స్వయంగా హైద్రా బాద్ నుండి సూర్యాపేట కు విచ్చేసి ఎంతో ఎత్తు ఎదిగిన చిన్న నాటి తన ప్రియ శిష్యుణ్ణి న్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజేష్ చదివే రోజుల్లో ఎంతో వినయంగా ఉండేవాడని అతని సంస్కారాన్ని చూసి నేను, నా సహచర అధ్యాపకులు కరస్పాండెంట్ తుక్కని మన్మధ రెడ్డి ఇతను జీ వితంలో ఎంతో ఎత్తు ఎదుగుతారని ఊహించామని, అట్టి కలను నిజంచేసిన రాజేష్ నేటి విద్యార్థి లోకానికి ఆదర్శ నియుడని అన్నారు. సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో ఉపాధ్యాయులు గా పనిచేసిన దశరథ సార్ జీవితంలో గొప్పగా ఎదిగి మనం బతుకుతూ కొంతమందికి తోడ్పాటు అందించినప్పుడే జీవితానికి సార్ధకత ఉంటుందని చెప్పిన మాటలు నా మీద ఎంతో ప్రభావం చూపాయని అందుకే వైద్యరంగాన్ని ఎంచుకొని నా వంతు ప్రజలకు సేవ చేసి జన్మభూమి రుణం తీర్చుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవిష్య విద్యాసంస్థల అడ్మినిస్ట్రేటర్ ఎన్.చంద్రశేఖర్ సూర్యాపేట ఏజీఎం నామాల గురుమూర్తి నల్గొండ ఏజిఎం వీరేష్ వైస్ ప్రిన్సిపాల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.