రామాపురం క్రాస్ వద్ద రోడ్డుప్రమాదం

Uncategorized కోదాడ క్రైమ్ సూర్యాపేట

రామాపురం క్రాస్ వద్ద రోడ్డుప్రమాదం

 

 

 సూర్యాపేట జిల్లా  మీ న్యూస్ ప్రతినిధి::సూర్యాపేట జిల్లా : కోదాడ మండలం నల్లబండగూడెం రామాపురం క్రాస్ వద్ద రోడ్డుప్రమాదం జరిగింది.జాతీయ రహదారిపై సిమెంట్ లారీ బోల్తా పడింది. కోదాడ నుంచి విజయవాడకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. సిమెంట్ బస్తాలు చెల్లాచెదురుగా పడటంతో కాసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడడంతో సంఘటన స్థలానికి చేరుకున్న కోదాడ రూరల్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు.